మాజీ ఎంపీ జివి హర్ష కుమార్ విశాఖ పోలీసులపై చేసిన ఆరోపణలు సబబు కాదని హాని ట్రాప్ కిలేడీ జాయ్ జమీమా బాధితులు తల్లి ఖండించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కిలేడీ లేడి జాయ్ జమీమా ఓ సాధారణ మహిళ కాదని ఆమె తలచుకుంటే ఎటువంటి వారినైనా మత్తులో దించగల వలపు లేడీ అని, ఆమె వలలో చిక్కుకుని బాధింపబడిన మాలాంటి వాళ్లకే ఆ బాధ తెలుస్తుందని అలాంటి కిలేడీ పట్ల మాజీ ఎంపీ హర్ష కుమార్ ఎందుకు అంత సానుభూతి చూపుతున్నారో అర్థం కావడంలేదని, హనీ ట్రాప్ వ్యవహారంలో హర్ష కుమార్ ముఖ్య పాత్ర పోషించి ఉండాలి, లేదంటే ఆమె బాధితుడైనా అయి ఉండాలని మండిపడ్డారు. పోలీసులపై ఓ మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సమాజం గమనిస్తూనే ఉందన్నారు. కిలేడీ లేడి బాధితుల్లో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని, ఆమె ఉపయోగించిన మత్తుపదార్థాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.
మాజీ ఎంపీ జివి హర్ష కుమార్ విశాఖ పోలీసులపై చేసిన ఆరోపణలు సబబు కాదు. ! #vvwnews
by vvwnews.com
written by vvwnews.com
48