*DESSERTINO* VIZAG ఫన్సేజ్ ఆర్కే బీచ్ లో ప్రారంభించబడింది ఫ్యామిలీతో వచ్చి బీచ్ వాతావరణం లో ఉన్నది

by vvwnews.com

డాక్టర్ కందుల ఆధ్వర్యంలో
రిక్షా కార్మికులకు యూనిఫామ్ ల పంపిణీ

విశాఖ దక్షిణ నియోజకవర్గం
జనసేన పార్టీ నాయకులు,
32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో
శనివారం ఉదయం 150 మంది
రిక్షా కార్మికులకు యూనిఫామ్ లు
అందజేశారు.
అల్లిపురం డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో జరిగిన
కార్యక్రమంలో
దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదగా ఈ
యూని ఫామ్ లు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ
డాక్టర్ కందుల నాగరాజు నిర్విరామంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు రిక్షా
కార్మికులకు యూని ఫామ్ లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. వార్డులోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కూడా ఆయన సేవలు అందజేస్తున్నారని కొనియాడారు.
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు నేడు మంచి పాలన అందుతుందని అన్నారు.
ఈ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
జనసేన అధినేత,
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాము ప్రజల్లోకి వెళ్తూ వారి సమస్యల సాధన కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ
రిక్షా కార్మికులు తమ రక్తాన్ని చెమట రూపంలో చిందించి తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారని అన్నారు.
వీరిని అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవలిసిన అవసరం ఉందన్నారు.
వీరు పడే కష్టానికి త్వరగా వీరికి వృద్ధాప్యం వచ్చేస్తుందని
ఏభై ఏళ్ళు దాటిన
ప్రతి రిక్షా కార్మికుడికి ప్రభుత్వం పింఛన్ సదుపాయం కల్పించాలని కోరారు.
అలాగే గత నాలుగు దశాబ్దాల నుంచి కె.ఎన్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఒక ప్రజా ప్రతినిధిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తాను ఎంతోమందికి సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు.
రాజకీయ, కుల మతాలకు అతీతంగా తాను చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుందని అన్నారు.
మచ్చ రాజు,
సీపీఐ బుజ్జి, కుమారి,కందుల రాజేశేఖర్,
కె.అప్పారావు,
ఎల్లపు ఆధిబాబు,
రాజశేఖర్,శ్రీదేవి,భారతి, కోదండమ్మ, సునీత, జానకి,విజయ, కందుల కేదార్ నాధ్,
కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles