విశాఖలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో డిసెంబర్ 29న ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్

by vvwnews.com

విశాఖలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో డిసెంబర్ 29న ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో సారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2024 నిర్వహిస్తున్నట్టు స్టార్ మేకర్ సత్యానంద్ చెప్పారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీ లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశం లో సత్యానంద్ మాట్లాడుతూ విశాఖలో తన దగ్గర శిక్షణ పొందిన సంతోష్ డాన్స్ లో మాస్టర్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లి షార్ట్ ఫిల్మ్ తీయడం అభినందనీయం అన్నారు . ఈ లఘు చిత్రంలో తాను కూడా నటించానన్నారు. సంతోష్ షార్ట్ ఫిల్మ్ అవార్డు కోసం ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు.
ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు
డాక్టర్ జాలాది విజయ మాట్లాడుతూ ఎంతో మంది హీరో లకు శిక్షణ ఇచ్చిన గొప్ప వ్యక్తి సత్యానంద్ అని కొనియాడారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ లో 14 రాష్ట్రాల నుంచి 84వేల మంది కళాకారులు వున్నారని చెప్పారు. నవంబర్ 16న హైదరాబాద్ లో ఫిల్మ్ స్క్రీనింగ్స్ నిర్వహించామని, డిసెంబర్ 22న విశాఖలో నిర్వహిస్తామని చెప్పారు.
కళలకు కళావేదిక విశాఖలో ఫెస్టివల్ నిర్వహించడం ఆనందం గా ఉందన్నారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్య నారాయణ, ఐ ఎఫ్ ఎం ప్రతినిధులు రాంచద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles