అంగన్వాడీ కేంద్రాల్లో తమ పిల్లలను చేర్పించాలని మంత్రి కోరారు.

by vvwnews.com

గోవిందరావు పేట మండలం.
ములుగు జిల్లా.

అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు మనోవికాస కేంద్రాలు కావాలి.

తల్లితండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలి.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క
అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు మనోవికాస కేంద్రాలు కావాలనీ, తల్లితండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలనీ
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.

మంగళవారం గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామం లో 12 లక్షల అంచనా వ్యయం తో నూతన అంగన్వాడీ- 4 వ భవనానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క,గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ తో కలసి
శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు 03-06 సంవత్సరాల పిల్లల కు మనో వికాస కేంద్రాలని అన్నారు. ఈ ప్రాంతంలోని పిల్లల పూర్వ ప్రాథమిక విద్యా వ్యవస్థకు ఈ శాశ్వత భవనాల నిర్మాణం ఓ మైలురాయిగా నిలిచింది పోతుందని అన్నారు.
ఇది ఒక భవన నిర్మాణం మాత్రమే కాదని దేశ పురోగతిని మార్చే భవిష్యత్తు పౌరులను తయారు చేసే కార్మాగారమని అన్నారు.
మన ములుగు జిల్లాలో మొదటి దశలో 2 కోట్ల 16 లక్షల నిధులతో
18 నూతన అంగన్వాడీ భవనాలను నిర్మించబోవుచున్నామని అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి వివిధ మౌలిక వసతుల 91 లక్షల 72 వేల రూపాయల బడ్జెట్ మంజూరీ చేయడం జరిగిందని దీంతో మొత్తం 3కోట్ల 7 లక్షల 72 వేల రూపాయలు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం మరియు అభివృద్ధి కొరకు మంజూరీ చేయడం జరిగిందని అన్నారు.
బాల్యం అంటేనే ఎలాంటి ఒత్తిడులు లేని జీవితం అని, ఆట పాటలతో ఆనందంగా కొనసాగే బాల్యంలో పిల్లలకు మన అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుందని అన్నారు.
ఈ కొత్త భవనం పూర్తయిన తర్వాత, పిల్లలకు భద్రత, రక్షణ లభిస్తుందని, చక్కని పోషక ఆహారం అందించడం ద్వారా శక్తివంతమైన రేపటి సమాజాన్ని ఈ అంగన్వాడీ కేంద్రాల్లో రూపుదిద్దడం జరుగుతుందని అన్నారు.
విద్య, వైద్యం అత్యంత ఖరీదైన ఈ రోజుల్లో పిల్లలకు నాణ్యమైన చక్కని పౌష్టికాహారం, క్రమశిక్షణా పూర్వకమైన ఆట పాటలతో కూడిన విద్యను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అందించడం జరుగుతుందని, తల్లితండ్రులు ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల్లో తమ పిల్లలను చేర్పించాలని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జీ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జిల్లా సంక్షేమ అధికారిణి శ్రీమతి కూచన శిరీష స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సఖి, డీసీపీయు, CHL, DHEW సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles