రాజ్యాంగం ప్రశ్నించే హక్కును ఇచ్చింది.భారత రాజ్యాంగాని కాపాడుకోవాలి

by vvwnews.com

రాజ్యాంగం ప్రశ్నించే హక్కును ఇచ్చింది.

భారత రాజ్యాంగాని కాపాడుకోవాలి.

రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.

భారత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు చొరవ చూపాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

మంగళవారం 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రశ్నించే హక్కును రాజ్యాంగం రూపొందించిందని, రాజ్యాంగం లోని ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మేధస్సు గల వ్యక్తి అని, అనేక కష్ట నష్టాలు పడి భవిష్యత్తు తరాల వారికి ఇబ్బందులు కలగకుండా పలు చట్టాలను రూపొందించిన మహనీయుడని కొనియాడారు. రాజ్యాంగాన్ని రూపొందించిన ఆ మహానీయుడు పండిత్ జవహర్లాల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ తో కలిసి పార్లమెంట్లో ఆమోదింప చేశారని, కొంతమంది వ్యక్తులు రాజ్యాంగ చట్టాలను తుంగలో తొక్కినందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంటరానితనం నిర్మూలన, ప్రతి ఒక్కరు విద్య నేర్చుకోవాలనే తపనతో ముందు సాగారని, మహనీయులు రూపొందించిన రాజ్యాంగ చట్టాలు అమలు కాని పక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కాకుండా మానవులందరికీ నష్టం జరుగుతుందని అన్నారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు జన్ను రవి, ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles