*విశాఖ ఫుడ్ సేఫ్టీ అధికారులు మేల్కొవాలి- ఏఐవైఎఫ్*
*హోటళ్ళలో కల్తీ ఆహార వంటకాలను నియంత్రించాలి:- ఏఐవైఎఫ్*
రాష్ట్రంలో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా కల్తీ ఆహార ఉత్పత్తులను, హోటల్లో కల్తీ వంటకాలను ప్రభుత్వం అరికట్టడంలో పూర్తి వైఫల్యం చెందారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. అచ్యుత్, వై రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా విశాఖ నగర పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, పుడ్ కోర్టులు నిత్యం నిల్వ ఉంచే ఆహార పదార్థాలను వినియోగదారులకు అమ్ముతున్నారని దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల తరచూ తనిఖీలు చెప్పట్టకుండా నిర్వాహకులు ఇచ్చే లంచాలకు అలవాటుపడి ప్రజల ఆరోగ్యాన్ని ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్య శ్రీయస్సుకోసం అఖిల భారత యువజన సమాఖ్య- AIYF ఎల్లప్పుడూ విభిన్న కోణాల్లో పోరాడుతుందని అన్నారు. ఈ ఉద్యమాన్ని జిల్లాలో ప్రజలను చైతన్యం చెసి కల్తీ ఆహర పదార్ధాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సందీప్, నాగరాజు పవన్, శ్రీను, హరీష్ , అభిషేక్ పాల్గొన్నారు.
విప్లభివందనములతో….
వై. రాంబాబు AIYF జిల్లా కార్యదర్శి ( 8897635412)