అదానీ సంస్థల్లో తో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి

by vvwnews.com

*ప్రెస్‌నోట్‌*
*అదానీసంస్థతో ఎపి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దుచేయాలి*
*సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్‌*
సౌరవిద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో 2029కోట్ల రూపాయల భారీ ముడుపులు అధికార, ప్రతిప్రతిపక్ష పార్టీలకు ముట్టజెప్పినట్లు అమెరికా తూర్పు న్యూయార్క్‌ జిల్లా కోర్టు తెలియజేసింది. అదానికి ప్రజల సంపదను దోచిపెట్టేందుకు ఈ భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు స్పష్టమవుతోందన్నారు. భారీ ముడుపులు చెల్లించిన అదానీతో పాటు ముడుపులు తీసుకున్నవారిని తక్షణమే అరెస్టు చేయాలని, ఎపి ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దుచేయాలని సిపిఎం పార్టీ డిమాండ్‌ చేస్తుందన్నారు.
అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దుచేయాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో జగ్గునాయుడు పాల్గొని మాట్లాడుతూ ఎపి ప్రభుత్వం అదానికి కేటాయించిన భూములను, ప్రజల సంపదను వెనక్కి రాబట్టాలని, రాష్ట్రంలో అదానీ డిస్కంలతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దుచేసి స్మార్ట్‌ మీటర్లను నిలుపుదల చేయాలని కోరారు. గౌతమ్‌ అదాని, మరో ఏడుగురు నిందితులు సెకీ నుండి ఆంధ్రప్రదేశ్‌ డిస్కాములు ఏడు గిగావాట్లు సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేయడానికి 2019`24 మధ్యకాలంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం 2029 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు అమెరికా కోర్టు వెల్లడిరచింది. సౌర విద్యుత్‌ యూనియట్‌కు యాభైపైసలకే ప్రజలకు అందించొచ్చని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం వినలేదన్నారు. అదానీ లాభాలకోసం విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపటానికే ప్రభుత్వం ముడుపులు తీసుకొని పెడచెవిన పెట్టిందన్నారు. చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ లు ఈ విషయంపై ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నష్టదాయకమని ప్రారంభం నుండి సిపిఎం పార్టీ తెలుపుతున్నా ప్రభుత్వం వినిపించుకోలేదన్నారు. 2019`20మధ్య సెకీ ఒప్పందమేగాక రాష్ట్రంలో పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్లాంట్లు, విశాఖలో డేటా సెంటర్‌, గంగవరంపోర్టు వంటి వివిధ ప్రాజెక్టులను అదానీ గ్రూపు సంస్థతో ఒప్పందం చేసుకుందన్నారు. తక్షణమే ఈ ఒప్పందాలన్నీ రద్దుచేయాలని కోరారు. గంగవరం పోర్టును స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించాలని, డేటా సెంటర్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని సూచించారు. ఎపిలో అదానికి కట్టబెట్టిన ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు ఎం.సుబ్బారావు, పి.పైడిరాజు, వి.కృష్ణారావు, నాయకులు జి.అప్పలరాజు, కె.కుమారి, వై.రాజు, పి.వెంకటరావు, జి.వి.ఎన్‌.చలపతి, కుమార్‌మంగళం, అప్పారావు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
ఎం.జగ్గునాయుడు
కార్యదర్శి

Use Social Media to Spread the Word about Our News

related articles