*రెండు జిల్లాలకు మంచినీళ్లు అందస్తున్నాం కానీ మాకు తాగడానికి నీళ్లు లేవు*
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం DK పర్తి పంచాయతీ భీమవరం గ్రామం..
ఈగ్రామం రెండు జిల్లాలకు నీళ్లు అందించే తాటిపూడి జలాశయం కు అనుకుని ఉంది… కానీ ఈ ఊరికి తాగడానికి నీళ్లు లేవు.. రోడ్డు సౌకర్యం లేవు.. ఈ గ్రామం గ్రామకంఠం పరిధిలో లేదు… ఈ గ్రామాన్ని పట్టించుకొనే నాధుడే లేదు.. వెలుగు సంబందిచి ఇక్కడి మహిళలకు ఎటువంటి సమాచారం ఉండదు.. రేషన్ గాని ఇంకే సదుపాయం గాని అందుబాటులో లేదని గ్రామస్తులు బాధపడుతున్నారు.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ గ్రామాన్ని పట్టించుకోని రోడ్డు వేస్తె… ఈ గ్రామానికి ఆనుకోని ఉన్న తాటిపూడి ఫారెస్ట్ కాటేజ్ లకు సందర్శకులు వస్తారు…
ప్రభుత్వానికి ఆదాయం తో పాటు ఇక్కడ గిరిజనులకు జీవనోపాధి కూడా ఉంటుంది…ఏళ్ల తరబడి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్న భూమి పై హక్కుగాని ఎటువంటి ROFR పట్టాలు కానీ ఇవ్వలేదు పేరుకే ptg గ్రామాలు కానీ చట్ట ప్రకారం ఒక్క సదుపాయ0 కూడా లేదు. సిదలవస్తుకు ఉన్న ఎంపీపీ స్కూల్.. ఎప్పుడు పడిపోతుందో ఎవరికీ తెలియదు…
అలాగే వెలుగు ఏపీఎం లు ఆ గ్రామాలను సందర్శించి సమావేశాలు ఏర్పాటు చేసి వ్యక్తిగత రుణాలు ఇప్పించినచో వారు చేతి వృత్తులు ద్వారా జీవనం సాగిస్తారు… అలాగే వారు అభర్దిస్తున్నది తాగడానికి నీళ్లు లేవని… ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు వారి ఊరు చుట్టూ నీరున్న వారికీ తాగడానికి నీళ్లు లేవనే వారి బాధను అర్థంచేసుకుని ఆ గ్రామానికి మౌళిక సదుపాయాలు అందిచగలరని ప్రభుత్వ అధికారులను కోరుకుంటూన్నాము..
విజయనగరం జిల్లా మంత్రి గారు.. జిల్లా కలెక్టర్ గారు ITDA po గారు సంబంధిత అధికారులు ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటున్నాము
తుమ్మి అప్పలరాజు దొర
ఆదివాసీ JAC రాష్ట్ర వైస్ చైర్మన్
విజయనగరం జిల్లా చైర్మన్
8500044423