ప్రెస్ నోట్ కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి ఆటో డ్రైవర్ కు రావికృష్ణ పిలుపు నవంబర్ 26న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు కార్మిక ప్రజా రైతంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగు కార్మిక ప్రదర్శన అనంతరం జరిగిన సభను జయప్రదం చేయాలని తేదీ 20 11 2024 ఉదయం 10:30 కి రైల్వే స్టేషన్ ఇన్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కృష్ణ మాట్లాడుతూకేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజా రైతన్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు నవంబర్ 26న విశాఖ డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు జరిగే కార్మిక మహాప్రదర్శనలో ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని ఏఐటియుసి నాయకులు రవి కృష్ణ ఆటో డ్రైవర్ పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా రైతన్న వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ బడా పెట్టుబడిదారులైన అదాని అంబానీ రిలయన్స్ సంస్థలకు దేశ సంపదను దోచి పెడుతున్నారని మండిపడ్డారుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆటో డ్రైవర్లు పోరారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఎంఏ ఖాన్ సూరిబాబు ఆనంద్ శివ గంగరాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు ఎంఏ ఖాన్
కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి AITUC
52