శీతోష్ణస్థితి వేడెక్కకుండా యువత కృషి అవసరం
– పర్యావరణ హితంగా జీవించాలి
– ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలి
– డాక్టర్ ఎం వివి మురళీ మోహన్, కేంద్ర కార్యవర్గ సభ్యులు, భారత ప్రజారోగ్య సంస్థ
శీతోష్ణస్థితి వేడెక్కకుండా యువత కృషి చెయ్యాలి అని భారత ప్రజారోగ్య సంస్థ కేంద్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎం వివి మురళీ మోహన్ కోరారు. సోమవారం మధ్యాహ్నం మద్దిలపాలెం లోని శ్రీ భావన విద్యానికేతన్ సంస్థ లో వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ నేతృత్వంలో, ఆస్ట్రేలియన్ కాన్సలేట్ జనరల్ సంస్థతో కలిసి నిర్వహించిన క్లైమేట్ ఫర్ యూత్ ఏక్షన్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. మొక్కలు నాటి పెంచాలని, అడవులు, కొండలు, గుట్టలు పరిరక్షణకు కృషి చెయ్యాలి అన్నారు . నదులు, వాగులు, సముద్రాల లోనికి హానికరమైన రసాయనాలు, భారలోహాలు, హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్ధాలు వెళ్లకుండా చూడాలని, ప్రజలను చైతన్య పరచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గాంబియా సోషల్ వర్క్ విద్యార్థిని ఆడమ్ బి సార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విశాఖపట్నం లో పలు సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమాలలో తాను స్వయంగా పాలుపంచకుంటున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.
సంస్థ ప్రిన్సిపాల్ కె. నీలమ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నాం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థినులు బి. చైతన్య సరస్వతి, బి. తేజస్విని, ఎకో వారియర్ జెవి రత్నం తదితరులు మాట్లాడారు.