మన కూరగాయల తోటే మునకు ఆరోగ్యం
– ఎకొ వైజాగ్ లో బాగంగా మిద్దె తోటలు అధికంగా పెంచాలి.
-ప్రకృతి ఆధారిత పంటలమీద అందరికీ అవగాహన అవసరం
– గాంబియా సోషల్ వర్క్ విద్యార్థిని ఆడమ్ బి సార్
మన కూరగాయల తోటే మునకు ఆరోగ్యం అని గాంబియా సోషల్ వర్క్ విద్యార్థిని ఆడమ్ బి సార్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఎం విపి కాలనీలోని ఉషోదయ జంక్షన్ వద్ద ఉన్న కె ఎం రావు మిద్దె తోటను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రకృతి ఆధారిత పంటలమీద అందరికీ అవగాహన అవసరం అన్నారు. ఎకొ వైజాగ్ లో బాగంగా మిద్దె తోటలు అధికంగా పెంచాలి అనె ఆలోచన చాలా బాగుంది అని వివరించారు.
మిద్దె తోట ఇంటి యజమాని, విశ్రాంత బిఎస్ఎన్ఎల్ ఇంజినీర్ కె ఎం రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పై కప్పు మీద తోటలు పెంచాలి అని కోరారు. ఆకుకూరలు, కూరగాయ మొక్కలు పెంచుకోవచ్చు అనే విషయం ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలన్నారు.
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం ఎకొ వైజాగ్ లో భాగంగా
కూరగాయ మొక్కలకు సంబంధించి పలురకాల నారులు పంపిణీ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థినులు ఉష, చైతన్య సరస్వతి తదితరులు పాల్గొని మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ మేడపై మొక్కలు పెంచాలి మనం తినే కూరగాయలు మనమే పండించుకోవాలి
52