హరే కృష్ణ వైకుంఠం , గంభీరం , విశాఖపట్నం
గోపూజమరియుగోవర్ధనపూజ 3 వ తేదీ నవంబర్ 2024 పత్రిక ప్రకటన
కార్యక్రమవివరాలు
సా|| 6:30 ని|| లకు – గోపూజ
సా|| 7:00 ని|| లకు – గోవర్ధనపూజ
సా|| 7:45 ని|| లకు – దామోదర హారతి
సా|| 8:15 ని|| లకు – శ్రీకృష్ణునికి నెయ్యి దీపాలు అర్పించడం
సా|| 8:45 ని|| లకు – ప్రసాదస్వీకరణ
ఈ కార్య క్రమములో డాక్టర్ నిష్క్రించిన భక్త దాస గారు భక్తులకు గోవర్ధన లీలా విశేషము గురించి వివరించడం జరిగింది .
ఈ సంవత్సరం ఈనెలలో 3 వ తేదీ నవంబర్ 2024 న గోవర్ధనపూజను హరే కృష్ణ వైకుంఠం , ఐఐఎం రోడ్, గంభీరం నందు హరే కృష్ణ మూవ్మెంట్ వారు సాయంత్రం 6:30 గంటలనుండి 9:00 గంటల వరకు అంగరంగ వైభోగముగా నిర్వహించడం జరిగింది . శ్రీ కృష్ణ భగవానుని గోవర్ధన లీల జరిగిన మాసము దామోదర మాసము , గోవర్థనగిరి పూజపండుగను నిర్వహించడం ఆనవాయితీ. ఈగోవర్థనగిరిపర్వతంచుట్టుకొలత 25 కి.మీ.లు.
గోవర్థనగిరి పూజసందర్భంగా హరేకృష్ణమూవ్మెంట్, విశాఖపట్నం వారిచే శాఖాహారములతో తయారుచేయబడిన గోవర్ధన గిరి నమూనా అన్న కుట వివిధ రకాలైన 5000 ఐదువేల లడ్డులతో , 108 రకాల తీపి మరియు వివిధ రుచికరమైన వంటకాలు అనగా రాగిలడ్డు, రాగిజంతికలు, కాజా, మైసూర్పాక్, గులాబీ రేకులు, జంతికలు, అటుకులు, అరిసెలు, రవ్వలడ్డు, చేగోడీలు, కొబ్బరిలడ్డులు, సంపంగిరేకులు, పంచదారఅరిసెలు, కోవా, నువ్వు లుండలు, ఎండినపండ్లు, లెమన్వాటర్, పాలు మరియు పెరుగుతో) గోవర్ధనగిరిపర్వతాన్ని తయారుచేసి పూజలు నిర్వహించడం జరుగుతుంది . పూజల అనంతరం దీనిని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టటం జరుగుతుంది . ఈగోవర్థనగిరి నమూనా చుట్టూ పరిక్రమ నిర్వహించండం ద్వారా గోవర్థనగిరి పర్వతం చుట్టూ పరిక్రమ చేసినటు వంటి పుణ్యఫలంలభిస్తుంది. ఈసందర్భంగా గోమాతకు పూజలు నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమము గో పూజతో ప్రారంభించడం జరిగింది . భక్తులు గోమాతను పూజించి గోమాతకు ప్రసాదమును తినిపించారు . అనంతరము గోవర్ధన పూజను నిర్వహించి గోవర్ధన పరిక్రమ నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమములో భక్తులకు గోపూజ మరియు గోవర్ధన పూజ ప్రత్యేకతలను భక్తులకు డాక్టర్ నిష్క్రించిన భక్తదాస ప్రెసిడెంట్ , హరే కృష్ణ మూవ్మెంట్ , విశాఖపట్నం వారు వివరించారు .
భక్తులు స్వయముగా దామోదర మాసం లో శ్రీకృష్ణ భగవానునికి నెయ్యి దీపాలతో హారతి ఇవ్వడం జరిగింది .
5వేలసం||ల క్రితం శ్రీకృష్ణభగవానుడు గోవర్ధనపర్వతాన్ని చిటికినవేలితో పైకెత్తి బృందావనంవాసులను ఇంద్రుని ఆగ్రహం నుంచి రక్షించినాడు .ప్రస్తుతం గోవర్థనగిరిపర్వతం ఉత్తరప్రదేశ్ లోని మథురజిల్లాలో బృందావనం వద్ద ఉన్నది. ప్రతీసంవత్సరం కృష్ణుడు గోవర్థనగిరిపర్వతాన్ని ఎత్తిన రోజున గోవర్ధనపూజ నిర్వహించడం ఆనవాయితి.
బృందావనంలో శ్రీ కృష్ణ భగవానుడు గోవర్ధన గిరి పర్వతమును చిటికిన వేలితో ఎత్తిన రోజున భక్తులు స్వహస్తాలతో పాలతో అనేకరకములైన తీపి పదార్ధములు తయారుచేచి గోవర్ధన గిరికి నైవేద్యము సమర్పిచడము ఆనవాయితీ .ఇదే సంప్రదాయమును హరే కృష్ణ మూవ్మెంట్ వారు విశాఖపట్నములో నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమం హరేకృష్ణమూవ్మెంట్, విశాఖపట్నం అధ్యక్షులు డా|| నిష్కించిన భక్తదాస గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది .
విశాఖ లో హరే కృష్ణ వైకుంఠం నందు కృష్ణ భక్తుల కొరకు 5 రోజులు లక్ష దీపోత్సవం కార్యక్రమును 27 వ తేదీ నవంబర్ నుంచి 1 వ తేదీ డిసెంబర్ 2024 వరకు సాయంత్రం 6 గంటలకు 5 రోజులు పాటు హరే కృష్ణ వైకుంఠం మందిర నిర్మాణ ప్రదేశములో , గంభీరం నందు అంగరంగ వైభోగముగా ప్రతి రోజు ఒక్కొక ప్రతేకతతో వేలాది మంది భక్తుల నడుమ నిర్వహించబడును . ఈ అవకాశమును భక్తులు ఉపయోగించుకొనగలరని డాక్టర్ నిష్క్రించిన భక్త దాస గారు ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ వారు ఈ పత్రిక ప్రకటన ద్వారా తెలిపినారు .
ఇట్లు
శ్రీ అంబరీష దాస
హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం