ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్ లో 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. వాల్టర్స్ ఎలెవన్, కాశిమ్ రైడర్స్, క్రాంతి ఎలెవన్
డ్రీమ్ ఎలెవన్, సక్ట్ జట్లు క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాయి. ఆరిలోవ ఫినాకీల్ మైదానంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న టోర్నిలో నాలుగు పూల్స్ నుంచి 24 జట్లు ట్రోపి కోసం తలపడ్డాయి. క్వార్టర్ ఫైనల్ స్థానం కోసం 10వ రోజు బరిలోకి దిగిన జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
ఈ సందర్బంగా క్రీడాకార్లు మాట్లాడుతూ ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా సాగుతుందన్నారు. ప్రతి క్రీడాకారుడుకి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి క్రీడాకారుడు గేమ్ ను చూసే విధంగా మ్యాచ్ లను లైవ్ లో ఇస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్స్ సుధీర్, రెహ్మాన్, నాగు, నవీన్, తదితరులు పాల్గొన్నారు
ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్ #vvwnews
51