లోటస్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎవియేషన్ అకాడమీ లో దీపావళి సంబరాలు #vvwnews

by vvwnews.com

రామాటాకీస్ డౌన్ రోడ్ లో వున్న లోటస్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎవియేషన్ అకాడమీ లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వుండే విద్యార్థులకు అందుబాటు పీజులతో ఎవియేషన్ లో ఏడాది కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు
కల్పించడమే సంస్థ లక్ష్యం అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం లేకుండా దీపావళి పండగ చేసుకోవాలన్నారు. అకాడమీ ప్రిన్సిపాల్ సప్తగిరి మాట్లాడుతూ దీపావళి పండగ సందర్బంగా ప్రజల్లో అవగాహనా కల్పించడమే తమ సంస్థ లక్ష్యం అన్నారు.అకాడమీ సెంటర్ హెడ్ పొన్నాడ ఉమా మాట్లాడుతూ ఎవియేషన్ లో నిజంగా ఉద్యోగాలు వస్తాయా అన్న అపోహ ఉందని ఎయిర్ టికెటింగ్, కార్గోషిపింగ్ మేనేజ్మెంట్ , క్యాబిన్ క్రూ,కస్టమర్ సర్వీస్ ల్లో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు ఇప్పటి వరకు 100 మందికి పైగా విద్యార్థులకు ప్లేస్మెంట్ ఇప్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బొట్టా రమణ, దూసి రమణ, అప్పారావు, నాగరాజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles