ఫ్యామిలీ మెలోడీస్ రాజేశ్వరరావు, కోటీ స్వర పరచిన చిత్ర గీతాలతో ‘ఏమని పాడెదనో ఈవేళ’#vvwnews

by vvwnews.com

ప్రముఖ సినీ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు 25 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం అక్కయ్యపాలెం స్వరాలయ స్టూడియోలో ఫ్యామిలీ మెలోడీస్ రాజేశ్వరరావు, కోటీ స్వర పరచిన చిత్ర గీతాలతో ‘ఏమని పాడెదనో ఈవేళ’ శీర్షికననిర్వహించిన సంగీత విభావరి ఆధ్యాంతం అలరించింది. విశ్వ ప్రసాద్ కోమలి పాడిన ఒక పూల బాణం, శివ నారాయణ, లక్ష్మి సాత్విక పాడిన గుమా గుమయించు కొంచెం, శ్యామ్ సుందర్, రమాదేవి పాడిన చిలిపి నవ్వుల నిన్ను, రాంబాబు, పూర్ణిమ పాడిన ఉన్న మాట చెప్పలేవా, ఎస్ఎస్ఎస్ రాజు, కృష్ణవేణి పాడిన ప్రియా ప్రయతమా రాగాలు, ఎస్ ఎన్ రావు, అలేఖ్య పాడిన గోకుల కృష్ణా, హర్ష ప్రియ పాడిన ఏ చోట వున్నా తదితర గీతాలు ఆలపించి శ్రోతల్ని తన్మయత్వంలో ముంచ్చేత్తించారు. తొలుత నార్త్ అసిస్టెంట్ పోలీసు కమీషనర్ అన్నెపు నరసింహ మూర్తి ముఖ్య అతిధిగా హాజరై సాలూరి చిత్ర పటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించి మాట్లాడుతూ తెలుగు పాటకు తన సంగీత బాణీలతో అన్ని తరాల వారి హృదయాలలో చేతగని ముద్రగా నిలిచిన రాజేశ్వరరావు చిరస్మణీయులని కొనియాడారు. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు చెన్నా తిరుమలరావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో కళా రంగ ప్రముఖులు కొణతాల రాజు, మెలోడీ సత్యనారాయణ, సంస్థ అధినేతలు శివ నారాయణ, విశ్వ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles