తణుకు మున్సిపల్ కమీషనర్ ద్వారా 2021-2022 సంవత్సరంలో రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన #vvwnews

by vvwnews.com

తణుకు మున్సిపల్ కమీషనర్ ద్వారా 2021-2022 సంవత్సరంలో రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన కొంతమంది భూమి యజమానులకు జారీ చేసిన ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ ప్రభుత్వం ద్వారా ఏర్పడిన సమస్యల మూలంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ బిల్డర్లు చేపట్టిన1800 ప్రాజెక్టులు ఆగిపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని ఏపీ టిడిఆర్ బిల్డర్ల సంఘం ప్రతినిధి రాజశేఖర్ వేడుకున్నారు. మంగళవారం వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున తణుకు టిడిఆర్లు అప్పటి అధికారులు తణుకు మున్సిపల్ కమీషనర్ ద్వారా 2021-2022 సంవత్సరంలో కొంతమంది భూమి యజమానులకు జారీ చేశారని, ఏదైనా జారీకి అనుసరించే ప్రామాణిక సాధారణ విధానం ప్రకారం జారీ చేయబడిందన్నారు. బిల్డర్లు పైన పేర్కొన్న బాండ్లను ప్రభుత్వ పోర్టల్ నుండి అధికారికంగా కొనుగోలు చేసామన్నారు. వాటిని మా ప్రాజెక్ట్ల వినియోగం కోసం లింక్ చేసామన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles