అనకాపల్లి లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం

by vvwnews.com

*అనకాపల్లి జిల్లా పోలీసు*
*పత్రికా ప్రకటన*
తేది:21.10.2024

*అక్టోబర్ 21 న అమర వీరుల సంస్మరణ దినం జిల్లా అదనపు ఎస్పీ ఎల్.మోహన్ రావు గారి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జరిగింది.*

*విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. అమరులైన పోలీసుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ క్రిష్ణణ్ ఐఏఎస్., గారు తెలిపారు.*

*అనకాపల్లి, అక్టోబర్ 21:* ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ… విధి నిర్వహణలో శాంతి భద్రతలు పరిరక్షణ కొరకు అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని, ప్రతీ ఒక్కరూ వారిని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. పోలీసు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తూ, పోలీసు కుటుంబాలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

*జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన్ రావు గారు మాట్లాడుతూ..* అక్టోబర్ 21, 1959న చైనాతో మన సరిహద్దును రక్షించే క్రమంలో ప్రాణాలర్పించిన 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవలను కొనియాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం స్మృత్యార్థం జరుపుకుంటున్నమన్నారు.
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 216 మంది, మన రాష్ట్రo లో ఇద్దరు పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారు.

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్బంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు, రక్తధాన శిబిరాలు నిర్వహించి పోలీస్ అమరుల త్యాగాలను, సేవలను తెలియజేస్తామన్నారు.
పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టడం జరిగింది అని తెలిపారు.

అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని, పోలీసు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో పోలీసు అమరవీరుల స్మృతి స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి, గౌరవ వందనం చేసి, పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

ఈ రోజు అనగా అక్టోబర్ 21 నుండి 31 రాష్ట్రీయ ఏక్తా దివాస్ వరకు పోలీసు అమర వీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ప్రజల్లోనికి వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

అమరులైన పోలీసు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలిసుకున్నారు. సిపిఐ మావోయిస్టులతో అనునిత్యం పొరాడి ప్రజలకోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లాలో వీరమరణం పొందిన 27 మంది పోలీసులకు (1983 నుండి 2024 సంవత్సరం మధ్య చనిపోయిన), దేశ వ్యాప్తంగా ఈ సంవత్సర కాలంలో 216 మంది మరియు మన రాష్ట్రo లో ఇద్దరు అమరులైన పోలీసుల పేర్లు జిల్లా ఏ.ఆర్ శ్రీ డీఎస్పీ పి.నాగేశ్వరరావు చదివగా, ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు పోలీసు అమరుల స్మృతి స్తూపానికి శ్రద్ధాంజలి ఘటించారు.

ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా 13 మంది అమరవీరుల ఒక్కొక్క కుటుంబానికి రూ:10,000/- నగదు చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమములో అనకాపల్లి సబ్ డివిజన్ ఇంచార్జ్ డీఎస్పీ శ్రీ బి.అప్పారావు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ కె.వి.సత్యనారాయణ, పరిపాలనాధికారి శ్రీ ఎ.రామ్ కుమార్, ఇన్స్పెక్టర్లు బాల సూర్యారావు, లక్ష్మి, వినోద్ బాబు, రమేష్, మన్మధరావు, సతీష్, నరసింహమూర్తి, సంజీవరావు మరియు ఇతర జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

*జిల్లా పోలీసు కార్యాలయము,*
*అనకాపల్లి.*

Use Social Media to Spread the Word about Our News

related articles