ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సీజన్ 2 టోర్నమెంట్ 12 రోజులు ముఖ్యఅతిథిగా కంచర్ల అచ్యుత రావు ప్రారంభించారు.

by vvwnews.com

ఘనంగా ఉపకార్ కప్- సీజన్ 2 క్రికెట్ టోర్నీ ప్రారంభం

ప్రతి మ్యాచ్ లైవ్ లో

29న కప్ బహుకరణ

విశాఖపట్నం : ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం అయ్యింది. ఆరిలోవ ఫినాకీల్ మైదానంలో ప్రతిష్టాత్మకంగా జరిగే టోర్నీని ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ప్రారంభించారు. తొలి మ్యాచ్ కు టాస్ వేశారు. అనంతరం ఇరు జట్లు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్బంగా అచ్యుతరావు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను అబ్బురపరిచారు. అనంతరం డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మీడియాతో మాట్లాడుతూ ఉపకార్ కప్- సీజన్ 1 ను విజయవంతంగా నిర్వహించామన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి ప్రతిభ కల్గిన ప్లేయర్స్ తో ఉపకార్ కప్- సీజన్ 2 టోర్నీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 24 ఫ్రాంచైజీలు నుంచి 450మంది ప్లేయర్ల పాల్గొంటున్నారని, 12 రోజుల పాటు జరిగే టోర్నిలో ప్రతి మ్యాచ్ కు లైవ్ ఇస్తున్నట్టు చెప్పారు. యువకులు దేశానికి పట్టు కొమ్మలు అని వారు ఎంత ఉత్సాహంగా ఉంటే అంత సక్సస్ అవుతుందన్నారు. దేశ ప్రధాని మోడీ , రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడులు యువతకు, క్రీడలకు పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నామని నగరం అంతంటా చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్న ట్టు చెప్పారు. నవంబర్ లో రాష్ట్ర స్థాయి వాలీ బాలీ పోటీలు, సంక్రాంతి సందర్బంగా విశాఖ వేదికగా అల్ ఇండియా టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. యువత చెడు దారిన పడకుండా క్రీడలపై ఆసక్తి పెంచడం ద్వారా వారిలో మనోవికాసం వృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఒక్కరు క్రీడలకు సపోర్టు చేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ నటులు ఉపేంద్ర బాబు పుట్టినరోజు సందర్బంగా ఈ నెల 29న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో టోర్ని లో విజేత గా నిలిచే జట్టు కు లక్షా 20వేల రూపాయలు, రన్నర్ జట్టు కు 60వేల రూపాయలు, తృతీయ జట్టు కు 30వేలు రూపాయలు ప్రైజ్ మనీ గా అందిస్తున్నట్టు చెప్పారు. వారిని ప్రోత్సహించే లక్ష్యంతోనే నగదు పురస్కారాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్స్ సుధీర్, రెహ్మాన్, నాగు, నవీన్, తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles