జగన్ పెద్ద జోకర్ లా తయారయ్యారని ఆరోపించారు #vvwnews

by vvwnews.com

తిరుపతి లడ్డు వ్యవహారం. వివాదంగా మారుతుందని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పారు. విశాఖలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు స్వాగతించదగన్నారు. శ్రీవారి లడ్డు కల్తీ వివాదం పై విచారణ త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ధైర్యం కల్పించాలన్నారు. తిరుమల లడ్డు కల్తీ లో బాద్యులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలన్నారు. తిరుమల తోపాటు అనేక దేవాలయాల్లో ప్రసాదం నాణ్యత పడిపోయిందన్నారు
నిబంధనలు సడలించడం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయిన్నారు
దేవాలయాల ట్రెస్ట్ పై నమ్మకం పోతుందన్నారు
కామన్ గుడ్ ఫండ్ తో ప్రతి జిల్లాలో ఒక లేబరేటరీ ఏర్పాటు చేయాలని ప్రసాదాలపై అనుమానం వస్తే అక్కడ టెస్టులు చేయాలని కోరారు. జగన్ పెద్ద జోకర్ లా తయారయ్యారని ఆరోపించారు.రామతీర్థంలో రాముని విగ్రహానికి తల తీసేశారు. ఇప్పటివరకు ఈ సంఘటనలో బాధ్యులను పట్టుకోలేదన్నారు రాష్ట్రంలో దేవాలయాలు పై 200 దాడి ఘటనలు జరిగితే ఎవరి మీద చర్యలు లేవుని విచారం వ్యక్తం చేసారు.దేవాలయాల విషయంలో తమాషాలు వద్దని హితవు పలికారు.
మతంలో రాజకీయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారని పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.. మతంలోకి ఎప్పుడు రాజకీయాన్ని తీసుకురాకూడదని చెప్పారు.
గత ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు
ఇంట్లో ఒక మతం రోడ్డు పైన మరో మతం ఉండకూడదని స్పష్టం చేశారు. తిరుమల దర్శనంలో డిక్లరేషన్ పై సంతకం చేసే మనస్సు జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే చెట్లను కొట్టేసావారని సమస్యలు సృష్టించేవారని పేర్కొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles