శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో వంశీకృష్ణ శ్రీనివాస్..#vvwnews

by vvwnews.com

శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా బురుజుపేట లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి అమ్మవారి రూపంలో కొలువుతీరిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేసి, ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. నవరాత్రి ఉత్సవాలు లో పాల్గొని ,అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలుకు భక్తులు పాత్రులు కావాలని అన్నారు. అనంతరం ఆలయ ఈఓ అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఈఓ శోభారాణి గారు, ఆలయ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొన్నారు…

Use Social Media to Spread the Word about Our News

related articles