సీతమ్మధారలోని హిల్ వ్యూ పార్క్లో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, AS రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి . విష్ణు కుమార్ రాజు కుమార్తె శ్రీమతి దీపిక, గురుద్వారా సద్ సంగత్, సిక్కు మిషన్ సౌత్ ఇండియా, ఇంచార్జి డాక్టర్ D.S. ఆనంద్, ప్రాజెక్ట్స్ ఫర్ ట్రస్ట్ డైరెక్టర్ శ్రీమతి గుర్మీత్ కోహ్లీ ప్రారంభించారు.
రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అనంత్రేం గణపతి మాట్లాడుతూ రోహిత్ అనంత్ గణపతి అనే స్ట్రాప్ యువకుడి జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచడానికి పదహారేళ్ల క్రితం స్థాపించిన ట్రస్ట్ సామాజిక అభ్యున్నతి కోసం ప్రత్యేకించి క్యాన్సర్ అవగాహన, కౌన్సెలింగ్, పాలియేటివ్ మెడికల్ క్లౌనింగ్, మహిళా సాధికారత రంగాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అన్ని వయసుల వారి స్వచ్ఛంద రక్తదాతల నుంచి యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు పేర్కొన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. శిబిరానికి హాజరైన దాతలతో సహా అందరికీ రక్తదానం ప్రాముఖ్యత, ప్రయోజనాలపై సలహాలు ఇచ్చారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతపై కూడా వారితో చర్చించారు.
రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, AS రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా రక్తదాన శిబిరాం
50