యువత శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చేయాలి యువత పర్యావరణ హితముగా జీవించాలి

by vvwnews.com

యువత శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చెయ్యాలి .
– యువత పర్యావరణ హితంగా జీవించాలి.
– విద్యార్థులు మొక్కలు నాటి పెంచాలి. చెట్లను కాపాడుకోవాలి
– దాట్ల వివేక్, ప్రోజెక్ట్ ఇంజినీర్, ఎస్ ఆర్ యు-జివిఎంసి
యువత శీతోష్ణస్థితి వేడెక్కకుండా యువత కృషి చెయ్యాలి అని సస్టైనబుల్ రిజిలియన్స్ యూనిట్ – జి విఎంసి ప్రోజెక్ట్ ఇంజినీర్ దాంట్లో వివేక్ కోరారు. శనివారం ఉదయం ఎంవిపి కాలనీ లోని ఎస్ వివిపి డిగ్రీ కళాశాలలో వ్యూస్ ఎన్ జిఒ, ఆస్ట్రేలియన్ కాన్సలేట్ జనరల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన యూత్ ఫర్ క్లైమేట్ చేంజ్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. విద్యార్థులందరినీ పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు. విద్యార్థులు అధిక సంఖ్యలో మొక్కలు నాటి పెంచాలని కోరారు. ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడుకోవాలని, పెద్ద పెద్ద వృక్షాలు ప్రజల ఆస్తి గా భావించి కాపాడుకోవాలి అని కోరారు. చాలా సంస్థలు శీతోష్ణస్థితి వేడెక్కకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చెయ్యాలని కోరుతూ పని చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చెయ్యాలి, మాట్లాడాలి, పదిమందికీ అవగాహన కల్పించాలన్నారు. శీతోష్ణస్థితి వేడెక్కకుండా, పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ విద్యార్థుల గురుతరమైన బాధ్యతగా స్వీకరించాలని కోరారు.
వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి మాట్లాడుతూ తమ సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం విశాఖ నగరంలో పలు విద్యా సంస్థల్లో విద్యార్థులతో పని చేస్తుంది అన్నారు. శీతోష్ణస్థితి వేడెక్కకుండా యువత కృషి చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అప్పారావు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ రాణీ ప్రియాంక, ఎకో వారియర్ జెవి రత్నం, ఎన్విరాన్మెంటల్ వాలంటీర్లు జె. రవితేజ, ఐ. కృష్ణకుమారి పలువురు విద్యార్థులు మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles