ఎస్ఇయు జార్జియన్ జాతీయ విశ్వ విద్యాలయంలో తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్య విద్య#vvwnews

by vvwnews.com

యూరప్ కు ముఖద్వారం లాంటి జార్జియా దేశంలోగల ఎస్ఇయు జార్జియన్ జాతీయ విశ్వ విద్యాలయంలో తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్య విద్య అందుబాటులో ఉందని ఆ విశ్వ విద్యాలయ రెక్టార్ డాక్టర్ బుచాస్ వల్లి తెలిపారు. సోమవారం ఆయన పెదవాల్తేరు విశాఖ ఐ హాస్పిటల్ వెనుక గల జీవి స్క్వేర్ లోని ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ భారత్ లాంటి అభివృద్ది చెందుతున్న దేశంలో వైద్య విద్య అభ్యసించడం మధ్య తరగతి ప్రజలకు అత్యంత ఆర్థిక భారంతో కూడుకున్న అంశమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య విద్య నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు తాము తమ ప్రఖ్యాత ఎస్ఇయు జార్జియన్ విశ్వ విద్యాలయంలో అన్ని వసతులతో వైద్య విద్యను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. తమ విద్యా సంస్థలో వైద్య విద్యతో పాటుగా నాణ్యమైన పలు కంప్యూటర్ అండ్ మేనేజ్మెంట్ విద్యలు మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ఫీజుల్లో అందిస్తున్నా మన్నారు. తాము అందిస్తున్న డిగ్రీలు అమెరికా మరియు యూరప్ ల్లో కూడా అక్కడి ఉన్నత విద్యా మండల్లు ఆమోదిస్తున్నా యన్నారు. ఇంటర్ 60 శాతం మార్కులు సాధించి నీట్ పరీక్షలో అర్హత సాధించిన వారు తమ వద్ద వైద్య విద్యలో చేరడానికి అర్హులన్నారు. ఇంటర్ 80 శాతం మార్కులు దాటిన వారికి స్కాలర్ షిప్ సదుపాయం కూడా ఉందన్నారు. భారత ప్రభుత్వం 2021వ సంవత్సరంలో విదేశాల్లో వైద్య విద్య నభ్యసించిన విద్యార్థుల అర్హతా ప్రమాణాలను సవరించిందని, ఆ సవరణల కనుగుణంగా తాము వైద్య విద్యను అందిస్తున్నా మన్నారు. తమ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు ఇండియన్ ఫుడ్ తో సహా అన్ని మౌళిక వసతులు అందుబాటులో ఉంచా మన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్, సంస్థ ప్రతినిధి వివేకానంద మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles