మహాత్మా గాంధీ వలె ప్రతి విద్యార్థీ సేవా తత్పరతను అలవర్చుకోవాలి.
– విజయవంతంగా ముగిసిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు.
– సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత ఉపకులపతి, కృష్ణా యూనివర్సిటీ
మహాత్మా గాంధీ వలె ప్రతి విద్యార్థీ సేవా తత్పరతను అలవర్చుకోవాలి అని కృష్ణా యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మురళీ నగర్ లోని జెఆర్ ఫంక్షన్ హాల్ లో ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సహకారం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలకు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. స్వచ్చతా హి సేవ 2024 పై అనేక విద్యా సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పి వి ముకుంద రావు మాట్లాడుతూ అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు భవిష్యత్తులో విద్యా సంస్థల్లో నిర్వహించడం జరిగుతోంది అన్నారు. స్వచ్చతా హి సేవ లో ఇంకా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఐఒ శాస్తవ్రేత్త టిఎన్ఆర్ శ్రీనివాస్, డ్రాయింగ్ టీచర్ మోహన్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోఆర్డినేటర్లు జె రవితేజ, ఐ కృష్ణ కుమారి, జె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ వలె ప్రతి విద్యార్థి సేవా తత్పర్తను అలవర్చు కోవాలి
53