చంద్రబాబు మనస్సే..ఒక అపవిత్రం…
– వెంకన్న ఆలయంలో కొబ్బరికాయలు కొట్టిన దక్షిణ వైసీపీ శ్రేణులు
వైసిపి అపవిత్రం చెయ్యలేదని శ్రీవారి హారతిపై ప్రమాణం…
– సీఎం చంద్రబాబు, పవన్ లపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి….
దేవదేవునీ తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ పై వైసిపి అపవిత్రం చేయలేదని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ వెంకటేశ్వర స్వామి హారతి పై ప్రమాణం చేసి స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టతను దెబ్బతీసేలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆడుతున్న డ్రామా లో శ్రీవారి లడ్డుపై జరిగిన ఆరోపణలను ఖండిస్తూ అల్లిపురం బలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి మెట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు దక్షిణ నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకులు ద్రోణం రాజు శ్రీ వాత్సవ్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనెన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ జాన్ వెస్లీ, మూగి శ్రీనివాస్,
వైసిపి శ్రేణులు స్వామివారికి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టారు.
ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మభ్యపెట్టి హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ ను మరిచిపోవాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసత్య ప్రచారాలతో చేసిన అపవిత్రాన్ని పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి ఆలయాల్లో పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 6వేల ఆలయాలు పునరుద్ధరించారని, మరో మూడు వేలు నూతన దేవాలయాలు నిర్మించి సనాతన ధర్మాన్ని కాపాడారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో, ప్రధాన ఉత్సవాల్లో 15 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేసే భాగ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దక్కిందన్నారు. సనాతన ధర్మాన్ని నిజంగా పాటించే జగన్మోహన్ రెడ్డి పై హిందుత్వాన్ని నాశనం చేస్తూ ఆలయాలను కూలగొట్టే చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరం అన్నారు. ఒక డిఫెన్స్ ఉద్యోగిగా ప్రమాణం చేసిన విధంగా ఆఖరి ఊపిరి వరకు దేశ రక్షణకు ఏ విధంగా పనిచేస్తామో అదేవిధంగా వైఎస్ఆర్సిపి ప్రజల సేవకు ఆఖరి ఊపిరి వరకు పని చేస్తుందని వెల్లడించారు. వైసిపి నాయకుడు మూగి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి అపవిత్రమైన మతాలతో ఆడుకునే రాజకీయం దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కూటమి ప్రభుత్వం చెయడం సిగ్గుచేటు అన్నారు. వైసీపీ మతం మానవత్వం అని, ప్రజలకు మంచి చేయడమే జగన్మోహన్ రెడ్డి ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లు చెన్నా జానకిరామ్, బిపిన్ జైన్, 33 వార్డు అధ్యక్షుడు ముత్తాబత్తుల రమేష్, సర్వేశ్వర్ రెడ్డి, మాజీ డైరెక్టర్ సనపల రవీంద్ర, ఎర్లమ్మ గుడి చైర్మన్ లండ రమణ, సీనియర్ నాయకులు లింగం శీను, యూత్ నాయకులు రవితేజ, కోన శంకర్, బూరుగుల చిన్న, బుల్లెట్ రవి, కోరాడ సురేష్, చంద్రకళ, లక్ష్మీకాంతం, కృష్ణారెడ్డి, ధర్మారావు, సూర్య, ఆకుల శ్యామ్, ప్రసాదరావు, పులి, సునీత, కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.