స్వచ్ఛతా హి సేవ 2024ను జయప్రదం చేయండి – డాక్టర్ ఎం వివి మురళీ మోహన్ #vvwnews

by vvwnews.com

స్వచ్ఛతా హి సేవ 2024ను జయప్రదం చేయండి
– డాక్టర్ ఎం వివి మురళీ మోహన్, ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి
స్వచ్ఛతా హి సేవ 2024ను జయప్రదం చేయండి అని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఎం వివి మురళీ మోహన్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సహకారం తో డాక్టర్ విఎస్ కృష్ణా డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ తో కలిసి “స్వచ్ఛతా హి సేవ 2024” కార్యక్రమం లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ పి. శ్రీలక్ష్మి మాట్లాడుతూ విశాఖపట్నం లో తమ విభాగం పలు స్వచ్ఛతా హి కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అన్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అన్ని ప్రాంతాలు పర్యావరణ హితంగా ఉండేందుకు కృషి చెయ్యాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ విజయబాబు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి జయ
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles