మహిళా మనోవికాస్ వ్యవస్థాపకురాలు మాధవి సూరిభట్ల నేతృత్వంలో 450 మంది అన్ని వయసుల చిన్నారులు,యువతులు, మహిళలు, వృద్దులతో కలిసి అతి తక్కువ సమయంలో 58,112 క్రోంచెట్ స్క్వెర్స్ మహిళలుధరించే నూలు వస్త్రం ను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఈ సందర్బంగా నగరంలో వెంకోజీపాలెం చందన మోహనరావు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో 58,112 క్రోచెట్ స్క్వేర్స్ న్ను ప్రదర్శించారు. వాటిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లండన్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి ‘లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ క్రోంచెట్ స్క్వెర్స్ ‘గా గిన్నిస్ రికార్డును ధృవీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధి ఇంటెక్ విశాఖపట్నం మాజీ కన్వీనర్ మయక్ కుమారి డియో,గౌరవ అతిధి క్రాఫ్ట్స్ కౌన్సిల్ అఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ డా. రేణుక రాణి, స్పెషల్ గెస్ట్ హెరిటేజ్ నారేటర్ వైజాగ్ జయశ్రీ హతన్గడి తో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేశారు. అనంతరం మాధవికి ధ్రువపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిన్నిస్ రికార్డు కోసం సాధారణంగా 20 వేల క్రోంచెట్ స్క్వెర్స్ తయారు చేయాల్సి ఉండగా 58,112 తయారు చేసి, అతిపెద్ద ప్రదర్శనను ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారని మహిళా మనో వికాస్ బృందాన్ని అయన ప్రశంసించారు.
అతి తక్కువ సమయంలో 58,112 క్రోంచెట్ స్క్వెర్స్ నూలు వస్త్రం ను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు
61