విశాఖలో వైజాగ్ స్కూటర్స్ మోటార్ సైకిల్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 43వ వార్షికోత్సవ వేడుకలు

by vvwnews.com

ఘనంగా జరిగాయి. కాన్వెంట్ జంక్షన్‌ వద్ద నున్న అసోసియేషన్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన వేడుకలకు విశాఖ ఎంపీ శ్రీ భరత్, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు హాజరుయ్యారు. ఈ సందర్బంగా శ్రీ భరత్ మాట్లాడుతూ బైక్ నడపటం తనకు భయం అని కార్లు ఉండడం వలన బైక్ నడిపే పరిస్థితి రాలేదన్నారు. సమాజంలో మెకానిక్ అవసరం పాత్ర కీలకం అన్నారు. ప్రతి ఒక్కరికి మెకానిక్ లతో అవసరం ఉంటుందన్నారు. వాహనాలు పెరుగుతున్నాయిని
అదే సమయంలో ప్రమాదాలు పెరుగుతున్నాయిని, ప్రాణ హాని జరుగుతుందని ప్రమాదాలను జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు. మెకానిక్ ల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ మెకానిక్ లు లేకపోతే రోడ్డు పై వాహనాలు తిరిగే పరిస్థితి లేదన్నారు మెకానిక్ లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పిల్లలు జీవితాలు, మన జీవితాలు కోసం ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలోవైజాగ్ స్కూటర్స్ మోటార్ సైకిల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎల్లపు రఘు రామ్, అసోసియేషన్ కార్యదర్శి వివి సత్య నారాయణ, ఎన్ శ్రీనివాస్ రెడ్డి , రవి వర్మ, నర్సింగ్, వాసు తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles