ఋషికొండ బీచ్ ను బ్లూ ఫ్లాగ్ పేరిట పర్యాటక శాఖ అధికారులు పూర్తిగా #vvwnews

by vvwnews.com

విశాఖకే తలమానికమైన ఋషికొండ బీచ్ ను బ్లూ ఫ్లాగ్ పేరిట పర్యాటక శాఖ అధికారులు పూర్తిగా దోచేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈరోజు ద్వారకానగర్ పౌరగ్రంధాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతు పర్యాటకుల మీద రుసుముల భారం వేస్తూ ప్రతినెల లక్షల్లో దోచేసి వాటాలు పంచుకుంటున్నా ఇప్పటికే చర్యలు తీసుకొకపోవటం ఆశ్చర్యకరమని,విశాఖ బీచ్లలో ఋషికొండకు ఒక్కదానికే ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు.అందుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లు సాకుగా చూపుతున్నారు. అయితే బ్లూ ఫ్లాగ్ నిబంధనల ప్రకారం పర్యాటకులకు కల్పించాల్సిన వసతులు ఏమాత్రం కల్పించడం లేదని అన్నారు.ఆంధ్ర కాంట్రాక్టర్ 5.75 లక్షలు నిర్వహించగా ఆయనను కాదని కేవలం లంచాల కోసం పది లక్షల ఎనభై వేల రూపాయలకు ఒరిస్సా కాంట్రాక్టర్కు దీనిని కట్టబెట్టారు. పర్యాటక శాఖలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించిన అధికారి పాణిగ్రహి శ్రీనివాస్ దీనిని తన అక్రమ సందపాదనకు అడ్డగా మార్చుకొన్నారు. దీంతో పాటు పలు పర్యాటక ప్రాజెక్టులను బ్రష్టు పట్టించిన ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని మాతృ శాఖకు సరెండర్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles