విజయవాడ వరద భాదితుల సహాయార్థం విశాఖ ప్రజలు ఎప్పటిలాగానే ముందుకొచ్చి సాయం#vvwnews

by vvwnews.com

విజయవాడ వరద భాదితుల సహాయార్థం విశాఖ ప్రజలు ఎప్పటిలాగానే ముందుకొచ్చి సాయం చేయడం అభినందనీయమని 35 వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర రావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం డబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన వివరాలు చెప్పారు. ఆయన వరద బాధితుల కోసం సేకరించిన హుండీలు తాళం తీశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ , ఆపన్న హస్తం అందించడంలో విశాఖ ఎప్పుడూ ముందు వుంటుందన్నారు. ప్రజలు విరాళాలు, పాత దుస్తులు, ఆహారం, మంచి నీరు బాధితులకు అందజేశారని గుర్తు చేశారు. తమ వార్థుకి చెందిన యూత్ బాయ్స్ విరాళాలు సేకరించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా టీమ్ సభ్యులను కార్పొరేటర్ అభినందించారు. తమ టీమ్ సాయంతో మంచి పని తలపట్టి డొనేషన్స్ కలెక్షన్ చేశామని విశాఖ సిటీ వైడ్ సోనూ సూద్ సంస్థ అద్యక్షుడు, 35 వార్డు పండా వీధి, ప్రసాద్ గార్డెన్స్ యూత్ బాయ్స్ ప్రతినిధి డోల జగదీష్ వెల్లడించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles