విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో గురువారం ఆయన కార్యాలయంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విజ్ఞాన భారతి రైల్వే స్కూల్ అంగన్వాడి టీచర్లను మొత్తం కలిపి 40 మందికి అతిధులు చేతుల మీదుగా ఘన సత్కారం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ
సమాజంలో గురువుకు ఎనలేని ప్రాధాన్యత ఉన్నదని, వారి సేవలు సమాజంలో వెలకట్టలేనివని చెప్పారు.
గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ గురువేనమః అంటే గురువే పరబ్రహ్మ స్వరూపమని అర్థమని, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పెద్దలన్నారని పేర్కొన్నారు. అమ్మానాన్నల తర్వాత గురువు స్థానం చాలా గొప్పదన్నారు. దేశంలో పిల్లల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తుచేసుకోవడానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన డాక్టర్ సర్వేపల్లి జీవితం ఆరదర్శనీయమన్నారు. కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గంట్ల శ్రీనుబాబు, టూ టౌన్ సీఐ తిరుమలరావు, బిజెపి సీనియర్ నాయకులు శాలివాహన, అడ్వకేట్ నారాయణరెడ్డి, కందుల కృష్ణ, రాజశేఖర్, ఆదిబాబు, కేదార్నాథ్, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో గురువారం ఆయన కార్యాలయంలో టీచర్స్ డే వేడుకలు
58