జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 54వ జన్మదిన వేడుకలు విశాఖ తూర్పు నియోజకవర్గం 15వార్డు లో ఘనంగా జరిగాయి. 15వ వార్డు జనసేన పార్టీ సీనియర్ నాయుకులు పచ్చితాల సాయిబాబా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి. భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త పంచకర్ల సందీప్ ముందుగా దుర్గా అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు జనసేన పార్టీ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్, , ముఖ్య అతిధిగా హాజరై మెడికల్ క్యాంపు ను ప్రారంభించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పచ్చితాల సాయిబాబా, కళావతి, త్రినాధ్ లు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు బి.పి, షుగర్, ఈసిజీ, కంటే పరీక్షలు చేసినట్టు పేర్కొన్నారు. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు ద్వారా యువత స్వచ్చందంగా రక్త దానం చేసినట్టు చెప్పారు. మహా అన్నసమారాధాన కార్యక్రమం చేసినట్టు చెప్పారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 54వ జన్మదిన వేడుకలు #vvwnews
57