జబ్బర్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ప్రథమ వర్ధంతికి హాజరైన మంత్రి డాక్టర్ సీతక్క

by vvwnews.com

– జబ్బార్ మరణం నాకు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

– జబ్బార్ ప్రథమ వర్ధంతి కి హాజరై ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

తేది.23.08.2024
జగ్గన్నపేట

ఈ రోజు ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామానికి చెందిన మంత్రి వర్యులు సీతక్క గారి వ్యక్తిగత సహాయకుడు గా పని చేసి ఇటీవలే కాలములో మరణించిన కొట్టేం వెంకటనారాయణ (జబ్బార్)
ప్రథమ వర్ధంతి కి హాజరై ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
గత 10 యేండ్లు గా నేను గెలిచిన ఓడిన నాతోనే నిత్యం అందుబాటులో ఉండి పని చేసి
అకాల మరణం చెందడం నాకు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారి కుటుంబానికి అండగా అందరం ఉంటామని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles