రక్షా బంధన్ పండగతో అన్నా చెల్లెళ్ళ అనుబంధం మరింత బలపడుతుంది
—సెంచురియన్ యూనివర్సిటీ చాన్సలర్ ప్రొఫెసర్ జీ.ఎస్.ఎన్.రాజు
రక్షా బంధన్ పండగ ద్వారా అన్నా చెల్లెళ్ళ అనుబంధం మరింత బల పడుతుందని సెంచురియన్ యూనివర్సిటీ చాన్సలర్ ప్రొఫెసర్
జీ.ఎస్.ఎన్.రాజు అన్నారు
విశాఖలోని ప్రజాపిత బ్రహ్మకుమారీలు ఆధ్వర్యంలో శనివారం రక్షాబంధన్ వేడుకలను డాబాగార్డెన్స్ వి.జే.ఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. సెంచురియన్ యూనివర్సిటీ చాన్సలర్ ప్రొఫెసర్ జీ.ఎస్.ఎన్ రాజు మాట్లాడుతూ విశాఖ లో ఏటా బ్రహ్మాకుమారి సంస్థ ద్వారా రాఖి పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.రక్షా బంధన్ పండగ ద్వారా అన్నా చెల్లెళ్ళ అనుబంధం మరింత బల పడుతుందన్నారు. పూర్వ కాలంలో నుంచి రక్షా బంధన్ పండగ మొదలయిందన్నారు.బ్రహ్మ కుమారీ సంస్థ ప్రతినిధి బి.కె. రామేశ్వరి మాట్లాడుతూ దుర్గుణాలు, వ్యసనాలకు మానవులు బానిస అవుతున్నారని, ఇతరులను రక్షించలేని స్థితిలో ఉన్నారన్నారు. నూతన నవ ప్రపంచంలో మానవులకు జ్ఞానం అందించాల్సి ఉందన్నారు. పరమేశ్వరుడు స్వరూపం ఆలయాలు, సృష్టిలో వుందన్నారు ప్రకృతి ధర్మం అధిగమించరాదని సూచించారు. దేశంలో ఉత్తరాన రాఖీ పౌర్ణమి, దక్షిణంలో జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారని తెలిపారు. యుద్ధానికి వెళ్ళే ముందు వీరులకు మహిళలు రక్షా బంధన్ కడతారన్నారు.పవిత్రత ద్వారానే భారత్ అగ్ర రాజ్యంగా అవతరిస్తుందన్నారు. ఆధ్యాత్మిక పుణ్య భూమిలో పలు పర్వ దినాలలో ప్రజలు సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు. రక్షా బంధన్ ద్వారా ప్రేమ, అనురాగం, ఆప్యాయత వెళ్లి విరుస్తాయన్నారు. మాటలలో మాధుర్యం వుండాలని, ఇతరులను నిందించరాదన్నారు. సింహాచలం దేవస్థానం మాజీ ధర్మకర్త గంట్ల శ్రీనుబాబు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మ కుమారీ సంస్థ ఏటా ముందుగా జర్నలిస్టులతో రాఖీ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు. పరమాత్ముడు ప్రజలను కరుణించాలంటే పర్వ దినాలు ఎంతయినా అవసరం అన్నారు. ప్రజలు దైవ కార్యక్రమాలకు సమయం కేటాయించాలని కోరారు. విజెఎఫ్ మాజీ ఉపాధ్యక్షులు, ప్రముఖ కొరియో గ్రాఫర్ నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ బ్రహ్మకుమారి సంస్థ ప్రతి సంవత్సరం జర్నలిస్టులను రాజస్థాన్ కు ఉచితంగా తీసుకువెళ్లి వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంపై ధన్యవాదాలు తెలిపారు.మీడియా సమావేశంలో బ్రహ్మ కుమారీస్ సంస్థ సభ్యులు సిద్దు, సునీత,బి.కే.సత్యవతి
అనూరాధ, భవాని, సుమ, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.