భూమి మీద ప్రప్రథమంగా మొదలైన వృత్తి వ్యవసాయం.
– మనకు ఆహారాన్ని అందించే రైతును గౌరవించడం మన కర్తవ్యం.
– భూమినీ, గాలినీ, నీటినీ, ఆహారాన్ని గౌరవించాలి.
– మనం తినే ఆహారాన్ని వృధా చేయరాదు
– జెవి రత్నం. వ్యవస్థాపక కార్యదర్శి. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో
భూమి మీద ప్రప్రథమంగా మొదలైన వృత్తి వ్యవసాయం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం అన్నారు. సోమవారం ఉదయం విశాఖపట్నం లోని ఇంటెల్లి విద్యార్థులను ఆనందపురం మండలం చందక గ్రామంలో శంకర్, మోహన్ అనె రైతులకు చెందిన పొలాల్లో వరి నాట్లు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటెల్లి విద్యా సంస్థ చాలా కాలంగా విద్యార్థులకు ప్రకృతి ఆధారిత వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కల్పించేందుకు కృషి చెయ్యడం అభినందనీయం అన్నారు. పది వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభం అయ్యిందన్నారు. రైతులు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టే మనం మూడు పూటలా భోజనం చేయగలుగుతున్నాం అని వివరించారు. అందుకే మనకు ఆహారాన్ని అందించే రైతును గౌరవించడం మన కర్తవ్యం అని ప్రతీ ఒక్కరూ తెలుసుకుని గౌరవించాలన్నారు. రైతులు కష్టించి పనిచేసి పంటలు పండిస్తేనే మనం హాయిగా జీవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుని జీవించాలని కోరారు. అందుకే విద్యార్థులంతా వ్యవసాయం చేయడం కూడా నేర్చుకోవాలి. వ్యవసాయం చేయడం వల్ల సహనం, నిబద్ధత, అందరితో కలిసిమెలిసి జీవించడం, సమయపాలన, కలుపు గోరు తనం, పరిపాలనా దక్షత, సమస్త జీవులను కాపాడుకునే తత్వం, మొక్కలను పెంచు కోవాలనె ఆలోచన ఇలా చాలా అంశాలు ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు. చిరాకు, చికాకు అనేవి కానరాకుండా పోతాయి. భూమినీ, గాలినీ, నీటినీ, ఆహారాన్నీ గౌరవించాలి అనే విషయం తెలుస్తుంది అన్నారు. ఏ ఒక్కరూ తాము తినే ఆహారాన్ని వృధా చేయరాదు, ఎవర్నీ ఆహారం వృధా చేయకుండా అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీచింగ్ ఫ్యాకల్టీ జయశ్రీ, శ్రీలత, మాధురి, సత్యవతి, కృష్ణ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వాలంటీర్లు జెనపరెడ్డి రవితేజ, ఇళ్ళ కృష్ణ కుమారి తదితరులు మాట్లాడారు. చిత్రకారుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
భూమి మీద ప్రప్రధమముగా మొదలైన వృత్తి వ్యవసాయం గ్రీన్ క్లైమేట్ టీం
61