భూగోళం మీద సమస్త జీవరాశినీ కాపాడవలసిన బాధ్యత మానవాళిదె
– ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జయప్రదం చేయండి
– ప్రకృతి ఆధారంగా పంటలు పండించండి, ఆరోగ్యంగా జీవించండి
– కె రమేష్ జాయింట్ చీఫ్ ఇంజనీర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి
భూగోళం మీద సమస్త జీవరాశినీ కాపాడవలసిన బాధ్యత మానవాళిదె అని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఇంజనీర్ కె రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం మాధవ ధార లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి చెందిన గోడ పత్రికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచారం “మన భూమి” అనే అంశం తో నిర్వహించడం జరిగుతుందని వివరించారు. ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నేపథ్యం (థీమ్)- భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువును తట్టుకునే శక్తిపై దృష్టి సారిస్తుందని ఐక్యరాజ్యసమితి పేర్కొందన్నారు. ఈ ఏడాది నినాదం “మా భూమి. మన భవిష్యత్తు. మేము, మా తరం భూమి పునరుద్ధరణ.” అని వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్త అవగాహన కలిగించడానికి 1973 నుండి నిర్వహించడం జరుగుతుంది అని వివరించారు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన అంశంగా పేర్కొంది అన్నారు.
కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి ముకుంద రావు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించబడుతున్న పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్) యొక్క పర్యావరణ కోణాల మీద పురోగతిని ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్ఇపి) నేతృత్వంలో, ప్రతి సంవత్సరం 150 దేశాలు పాల్గొంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సమూహాలు, ప్రభుత్వాలు, ప్రముఖులు పర్యావరణ పరిరక్షణ అంశాల కోసం “ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం” నిర్వహిస్తున్నారు అని వివరించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి విశాఖ మహానగరంలో విభిన్న అవగాహన కార్యక్రమాలు, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహిస్తుందని వివరించారు. అలాగే అనకాపల్లి జిల్లా లోనూ, మన్యం జిల్లా లోనూ విభిన్న స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా పర్యావరణ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
అసిస్టెంట్ ఇంజనీర్ ఎ ఎస్ ఆర్ సి మూర్తి మాట్లాడుతూ ఐక్యరాజ్య పర్యావరణ కార్యక్రమం గురించి పర్యావరణంపై ప్రముఖంగా ప్రపంచ నినాదాన్ని, నాయకత్వాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు రాజీ పడకుండా దేశాలు, ప్రజలు వారి జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు స్ఫూర్తిని ఇవ్వడం, తెలియజేయడం , అమలు చేయాలని కోరడం ద్వారా పర్యావరణ సంరక్షణలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎపిపిసిబి ప్రతినిధులు ఇఇ కరుణ రేఖ, ఎఇ శ్రీలక్ష్మి, సైంటిఫిక్ ఆఫీసర్ సంయుక్త, రీసెర్చ్ అసోసియేట్ గౌతమి తదితరులు, సిఫా ట్రస్ట్ సిఇఒ డాక్టర్ శశిప్రభ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు మాట్లాడారు. ఏక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి, గ్రీన్ క్లైమేట్ టీం వాలంటీర్ రాజేశ్వరి, సీఫా ట్రస్ట్ సిబ్బంది నర్సింగ్, హేమ, తదితరులు పాల్గొన్నారు.
WORLD ENVIRONMENT DAY రీసెర్చ్ అసోసియేట్ గౌతమి మరియు గ్రీన్ క్లైమేట్ టీం
59