56
శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం
తేదీ 28 మే 2024
శ్రీ జస్టిస్ సందీప్ మెహతా దంపతులు ( జడ్జ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా) శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు వేద పండితులు నాదస్వర వేదమంత్రాలతో స్వాగతం పలికి ముందుగా శ్రీ జస్టిస్ సందీప్ మెహతా దంపతులచే కప్పస్తంభము ఆ లింగనము చేయించి తదుపరి నాదస్వర వేదమంత్రాలతో బేడా ప్రదక్షిణ కావించి స్వామివారి అంతరాలయ దర్శనం తదనంతరం అమ్మవారి దగ్గర
పూజలు చేయించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు స్వామివారి విశిష్టతను తెలియజేశారు తరువాత వేద పండితులచే వేద ఆశీర్వచనము అనంతరము స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ఈవో శ్రీనివాసమూర్తి స్వామివారి పటము ప్రసాదాలను అందజేశారు..