శ్రీశ్రీశ్రీ అరహా లక్ష్మీ నరసింహ స్వామి సింహాచలం దేవస్థానం స్వాతి చందనోత్సవం ఈరోజు జరిగింది

by vvwnews.com

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం

సింహాచలం తేదీ 22 మే 2024

దిగ్విజయంగా స్వామి వారి జయంతి రోజునే స్వాతి హోమం

ఇఓ . ఎస్. శ్రీనివాసు మూర్తి

అంగరంగ వైభోగం శ్రీ స్వామివారి స్వాతి హోమం

వేదమంత్రాలతో పులకించిన సింహగిరి
పరవశించిన భక్తజనం

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరక స్వామివారి స్వాతి హోమమునకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి ని దర్శించుకున్నారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజు స్వామి,మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్ ను వేద మంత్రాలతో మృధు మధుర మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తముగా పూజాది కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు పూర్ణహుతి లో పాల్గొన్నారు భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం, భోజన సదుపాయం కల్పించారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా స్వర్ణ కవచ అలంకరణ లో ఉన్న సింహాద్రినాధుడు ను దర్శించుకుని సేవించుకున్నారు. యజ్ఞం మహా పూర్ణాహుతిలో ఆలయ అనువంశిక ధర్మకర్త చైర్మన్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు పాల్గొని పూజలు జరిపారు. ఆలయ ఈవో ఎస్ .శ్రీనివాస్ మూర్తి మహా యజ్ఞంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ యజ్ఞం ఎంతో ప్రతిష్టాత్మకంగా కనులు విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. ఆలయ ఉద్యోగులు అర్చక పరివారం, వేద పండితులు అధ్యాపకులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించి కున్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles