*అనకాపల్లి జిల్లా పోలీసు*
*అనకాపల్లి పట్టణం శివార్లలోని సుబ్రహ్మణ్యం కాలనీ మరియు డి.బి కాలనీ లో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో రికార్డ్స్ లేని ద్విచక్ర వాహనాలు (10), ఆటోలు (3) ను సీజ్ చేసిన అనకాపల్లి టౌన్ పోలీసులు*
*అనకాపల్లి, మే 21:* జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు అనకాపల్లి సబ్ డివిజన్, అనకాపల్లి టౌన్ ఎస్.హెచ్.ఒ జి.శంకర రావు గారి ఆధ్వర్యంలో ఎస్సైలు సత్యనారాయణ, అలీ షరీఫ్ మరియు అనకాపల్లి సబ్ డివిజన్ సిఐలు / ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు మరియు సిబ్బంది తో సుబ్రహ్మణ్యం కాలనీ మరియు డి.బి కాలనీ లో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి రికార్డ్స్ లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను మొత్తం 13 వాహనాలు స్వాధీనం చేసుకున్న అనకాపల్లి టౌన్ పోలీసులు.
ఈ సందర్భంగా అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుబ్రహ్మణ్యం కాలనీ వాసులతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అనుమానస్పద ప్రాంతాల్లో ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలు ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన రాదని హెచ్చరించారు.
*జిల్లా పోలీస్ కార్యాలయం,* *అనకాపల్లి.*