సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యానికి పెరిగిన స్పందన
– దీర్ఘ కాలంగా కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారికి ఉపసమనం
– అధిక సంఖ్యలో తరలి వచ్చిన మైగ్రేన్ బాధితులు
– దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జిల్లా అధ్యక్షులు, ప్రకృతి ఆధారిత రైతుల సంఘం
సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యానికి విశాఖపట్నం జిల్లా స్పందన పెరిగిందని ప్రకృతి ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పేర్కొన్నారు. సింహాచలం కొత్త గోశాలలో శని ఆదివారాల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి 460 మందికి పైగా వైద్య సేవలు పొందారన్నారు. హైదరాబాద్ లోని శ్రీ తులసీ వైద్యశాలకు చెందిన సిద్ధ వైద్యులు జగదీష్, రితిక్ కన్నా, శ్రీనాథ్ లు, సింహాచలం గోశాలలోని ప్రకృతి వైద్యశాలకు చెందిన వైద్యులు శ్రీదేవి వర్మలు వైద్య సేవలు నిర్వహించారు న్నారు.
సంస్థ కార్యదర్శి పాలెం నేచురల్స్ చవ్వాకుల అశోక్ మాట్లాడుతూ సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యుం వల్ల దీర్ఘకాలంగా ఉన్న రోగాలు ప్రధానంగా కీళ్లు నొప్పులు, మైగ్రేన్ బాధ, నడుంనొప్పి, మెడనొప్పి తదితర రోగాలు నయం చేయడానికి ఉపయోగపడుతుంది అన్నారు.
సంస్థ ప్రతినిధి నాగిరెడ్డి మాట్లాడుతూ శ్రీ రామ్ గురూజీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యానికి విశాఖపట్నం మంచి స్పందన లభించింది అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు మాట్లాడారు.
సిద్ధ ఆయుర్వేద మర్మ వైద్యానికి పెరిగిన స్పందన కీళ్ల నొప్పులన్నీ తగ్గుతున్నాయి గ్రీన్ క్లైమేట్ టీం
69