నూతన అవుట్ పేషంట్ కేంద్రం ప్రారంభం
విశాఖపట్నం, 20 ఏప్రిల్ 2024: LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, GMR వరలక్ష్మి క్యాంపస్, విశాఖపట్నం వద్ద ఈరోజు నూతన అవుట్ పేషెంట్ సెంటర్ ప్రారంభించారు. ఈ నూతన అవుట్ పేషెంట్ సెంటర్ ను డాక్టర్ సత్యనారాయణ చావా, CEO మరియు శ్రీ రవి కుమార్ వి.వి, ED & CFO, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ వారు ప్రారంభించారు. ఈ నూతన పేషెంట్ సెంటర్కు లారస్ ల్యాబ్స్ వారు తమ పూర్తి మద్దతును అందిస్తున్నారు. లారస్ ల్యాబ్స్ నుండి సీనియర్ నాయకత్వం వహిస్తున్న శ్రీ నరసింహా రావు చావా, HR హెడ్, & లారస్ ల్యాబ్ సభ్యులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సహకారంతో అంధత్వ నివారణకు, అన్ని వర్గాల వారికి సమానమైన నేత్ర సంరక్షణా సేవలు అందించుటకు కట్టుబడి అంధత్వం తొలగించుటకు కృషి చేస్తున్న ఉత్తమ నేత్ర వైద్య సంస్థ LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. అవసరమైన అందరికి అద్భుతమైన సంరక్షణా సేవలు అందిస్తున్న వైద్య సేవా సంస్థ. అర్థవంతమైన జీవన విధానాన్ని సాధించు దిశగా వ్యక్తులకు మంచి దృష్టిని ప్రసాదించుటకు కృషి చేస్తున్నాది. ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ది సాధనకు LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాది. ఈరోజు మా నూతన అవుట్ పేషంట్ విభాగ ప్రారంభించటం మాకు అమితానందం కలిగిస్తున్నాది. అసాధారణమైన నేత్ర వైద్య సేవలను అంకితభావంతో అందిస్తుంది అనటానికి ఇది ఒక నిదర్శనం. ఈ అవుట్ పేషంట్ సెంటర్ నందు 12 పరీక్షా గదులు ఉంటాయి. ప్రతిది 20 మంది అవుట్ పేషంట్లకు సదుపాయకరంగా నేత్ర సంరక్షణా వైద్య సేవలు అందిస్తాయి. అంతేకాక అదనంగా ప్రత్యేకమైన ఆప్తాల్మిక్ డయాగ్నస్టిక్స్ మరియు సుమారు 100 మంది వేచి ఉండేందుకు సువిశాలమైన వెయిటింగ్ హాల్ సదుపాయం కలిగి ఉంటుందని ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ వీరేందర్ సచ్ దేవా, క్యాంపస్ హెడ్, LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, GMR వరలక్ష్మి క్యాంపస్, విశాఖపట్నం అన్నారు. డాక్టర్ సత్యనారాయణ చావా, మరియు సీనియర్ నాయకత్వం లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ వారు మాకు చేయూతనిచ్చి మాతో చేరినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సేవా ప్రేరణలో మేము భాగస్తులు కావటం గౌరవప్రదంగా ఉంది …………………. అన్నారు
ఈ కీలకమైన మంచి ప్రయత్నంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారికి మద్దతు ఇవ్వడం మాకు చాల సంతోషంగా ఉంది. మా రంగంలో ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం మరియు నాణ్యతను అభివృద్ధి చేయడంలో అడుగు వేయటం, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచుటలో మా మద్దతును మరియు ధృడమైన నిబద్దతను ప్రతిబింబిస్తున్నాది. ఈ అవుట్ పేషెంట్ సెంటర్, 12 పరీక్షా గదులు, ప్రత్యేక నేత్ర రోగ నిర్ధారణలు మరియు విశాలమైన వెయిటింగ్ హాల్, ఆరోగ్య సంరక్షణలో నూతన ఆవిష్కరణలు మరియు నాణ్యతకు ఉదాహరణలు. అవుట్ పేషెంట్ సెంటర్ లో పెట్టుబడి పెట్టడం ఆరోగ్య రంగం యొక్క శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టడం మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది అన్నారు లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ CEO డాక్టర్ సత్యనారాయణ చావా.