ప్రెస్ నోట్ ఆటో అండ్ మోటార్ వాహన డ్రైవర్లకు సంక్షేమ బోర్డు చేస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీని గెలిపించండి ఆటో డ్రైవర్ కు జి వామనమూర్తి పిలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లపై వేస్తున్న ఆర్థిక భారాలను ఆపాలని కేంద్ర ప్రభుత్వం చేసిన 2023 నూతన మోటార్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను రద్దుచేసి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని కోరుతూ తేదీ 14 4 20 24 న ఉదయం 10 గంటలకి మధురవాడ బాంబే కాలనీలో ఆటో డ్రైవర్ల నిరసన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏ ఐ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామన మూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో అండ్ మోటార్ కార్మికులపై ఆర్థిక భారాలు వేస్తూ డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నిత్యవసర వస్తువుల ధరలను భారీగా పెంచి డ్రైవర్లకు జీవనాధారం లేకుండా చేస్తున్నాయని మండిపడ్డారు డ్రైవర్లకు జైలు శిక్షలు జరిమానాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన మోటార్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు నేడు జరుగుతున్న ఎన్నికల్లో ఆటోకార్మికులను గుర్తించి వారి సంక్షేమానికి సమగ్ర సంక్షేమ బోర్డు చేస్తామని రాజకీయ పార్టీలు నాయకులు హామీ ఇస్తూ ఎన్నికల మేనిఫెస్టో వారి సమస్యలను పొందుపరచాలని కోరారు రోడ్డు రవాణా రంగంపై ఆర్థిక భారాలు వేసే ప్రభుత్వాన్ని ఓడించి డ్రైవర్ల సంక్షేమానికి రక్షణ కల్పిస్తామన్న రాజకీయ పార్టీలను గెలిపించాలని డ్రైవర్లు కోరారు ఈ కార్యక్రమంలో స్టాండ్ అధ్యక్షులు జి శ్రీనివాసరావు బి కుమార్ స్వామి జే బ్రహ్మం పి నాగేశ్వరరావు టి అప్పారావు కే రాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి శ్రీనివాసరావు స్టాండ్ అధ్యక్షులు
AITUC ఆధ్వర్యంలో ఆటో కార్మికులు జీవో నెంబర్ 21 మరియు 31 రద్దు చేయాలని డిమాండ్
64