62
విజయనగరం జిల్లా నెల్లిమర్ల లో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో గత నెల రోజుల నుంచి విధులు బహిష్కరించి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. గత ఏడు డీ ఏ బకాయిలు చెల్లించకుండా, జీతాలు పెంచుకుండా వేధింపులకు గురి చేస్తున్న యాజమాన్యం మొండి వైఖరికి వ్యతిరేకంగా కార్మికులకు సంఘీభావంగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్మికులు యూనియన్ ఏర్పాటు చేశారని వారిని యాజమాన్యం విధులనుండి తొలగించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి విడనాడి యూనియన్ తో చర్చించాలనీ డిమాండ్ చేశారు. లేనియెడల చలో నెల్లిమర్ల నిర్వహిస్తామని హెచ్చరించారు.