సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 189 మంది విద్యార్థినులకు అల్లూరి సీతరామరాజు విజ్ఞాన కేంద్రంలో స్కాలర్షిప్పులు
పంపిణీ చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ విశాఖపట్నం.
విశాఖపట్నం: భారత దేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, 22 ఫిబ్రవరి 2024 ఉదయం 10 గంటలకు, అల్లూరి సీతరామరాజు విజ్ఞాన కేంద్రంలో, విద్యార్థినులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. విశాఖపట్నం నగరం నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు మలబార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో (CSR) భాగంగా ఈ స్కాలర్షిప్పులు అందుకున్నారు.
గౌరవనీయులు శ్రీ సత్య నారాయణ గారు లోక్ సభ సభ్యులు, జి. హరి వెంకట కుమారి గారు విశాఖపట్నం మేయర్, ఇతర స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు మలబార్ గోల్డ్ & డైమండ్స్, కోస్టల్ ఆంధ్రా రీజినల్ హెడ్ ఫెబిన్ గారు, స్టోర్ హెడ్ శ్రీమతి సునీత గారు మరియు మలబార్ గ్రూపు మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా 189 మందికి పైగా విద్యార్థి దరఖాస్తుదారులు గుర్తించబడ్డారు వారికి రూ. 98,70,000 స్కాలర్షిప్ మొత్తాన్ని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5500 మంది పేద విద్యార్థినులను ఎంపిక చేసి రూ 8,000/- నుండి 10,000/- వరకు స్కాలర్షిప్పులు అందిస్తామని ఈ సందర్భంగా మలబార్ గ్రూపు ప్రకటించింది.
మలబార్ గ్రూప్ యొక్క నిబద్ధతలో భాగంగా, సామాజిక సేవ కార్యక్రమాలకు, దాతృత్వ కార్యకలాపాలకు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాభాలలో 5% ఈ ప్రాంతంలో ఖర్చుపెడుతుంది. మలబార్ గ్రూపు సామాజిక సేవ కార్యక్రమాల్లో ముఖ్యంగా గృహ నిర్మాణం, వైద్య సహాయం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత మరియు విద్య రంగాల్లో దృష్టి సారిస్తుంది. గత 20 సంవత్సరాలలో మలబార్ గ్రూప్ వారి ‘మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్’ 33 కోట్ల రూపాయలకు పైగా వైద్య సహాయంగా వెచ్చించింది, అవసరాల్లో ఉన్న 6 లక్షల మందికి తమ సహాయం అందించారు. పేదల గృహనిర్మాణం కోసం 2004లో ‘మలబార్ హౌసింగ్ ఛారిటబుల్ ట్రస్ట్’ స్థాపించబడింది. ఇప్పటి వరకు ఈ ట్రస్ట్ 15,000 పేద కుటుంబాలకు 47 కోట్ల రూపాయలకు మించి నిధులను అందించింది. ‘హోమ్స్ ఫర్ హోమ్‌లెస్’ కార్యక్రమం కింద మలబార్ గ్రూప్ 250 మందికి పైగా వ్యక్తులకు ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
2007 నుండి మలబార్ గ్రూప్ బాలికల విద్యా కార్యక్రమాలకు మద్దతునిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న బాలికలకు స్కాలర్‌షిప్పులను అందించింది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.2000/- నుండి 3000/- వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. గత ఐదేళ్లలో మలబార్ గ్రూప్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని 15,000 మంది బాలికలకు దాదాపు 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ అందించారు.
ఎడిటర్స్ నోట్
విభిన్న వ్యాపార సమ్మేళనంతో 1993లో స్థాపించబడిన మలబార్ గ్రూప్ యొక్క ఫ్లాగ్షిప్ కంపెనీ మలబార్ గోల్డ్ & డైమండ్స్.
భారతదేశంలోని కేరళలో ప్రధాన కార్యాలయం కలిగియున్న మలబార్ గోల్డ్ & డైమండ్స్, భారతదేశం, మిడిల్ ఈస్ట్ & ఫార్ ఈస్ట్ అంతటా శాఖలతో బంగారం, వజ్రాలు, వెండి మరియు జీవనశైలి ఆభరణాల రంగంలో తమ కార్యకలాపాలకు ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచ వ్యాప్తంగా 260 షోరూములతో 4.51 బిలియన్ డాలర్ల వార్షిక టర్నోవరు కలిగియుంది.
వివిధ రకాల అభిరుచులు గల ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి ప్రస్తుతం 12 ఆభరణాల బ్రాండ్లను కలిగి ఉంది మలబార్ గోల్డ్ & డైమండ్స్. నాణ్యమైన ఉత్పత్తులతో, అద్భుతమైన సేవలతో అగ్రపథాన సాగుతున్న మలబార్ గ్రూపు తమ లాభాల్లో 5 శాతాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తుంది.
మరింత సమాచారం కోసం www.malabargoldanddiamonds.com వెబ్ సైట్ సందర్శించండి.