తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” 18 వ తేదీన సభలు నిర్వహించడం జరుగుతుంది

by vvwnews.com

రేపు అనగా ఆదివారం నాడు దక్షిణ నియోజకవర్గంలో శంఖారావం జరుగుతుంది అని టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ గండి బాబ్జి అన్నారు శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు నేడు
శంఖారావం పేరుతో యువగళం లో వేళ్ళని నియోజకవర్గాలలో లోకేష్ పర్యటిస్తున్నారు అని చెప్పారు
రేపు మధ్యాహ్నం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శంఖారావం సభలో లోకేష్ పాల్గొంటున్నారు అని తెలిపారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు మధ్యాహ్నం రెండు గంటలకు శంఖారావం సభ ప్రారంభమవుతుంది అని తెలిపారు లోకేష్ చేపడుతున్న శంఖారావం కు విశేష స్పందన వస్తుందని అన్నారు వైసీపీ నాయకులు చంద్రబాబు ను కించపరిస్తూ యాత్ర 2 సినిమా తీశారుయాత్ర 2 సినిమా కు ప్రజలు నుంచి ఆదరణ కరువైంది యదార్థ సంఘటనలతో రాజధాని ఫైల్స్ సినిమా తీశారు వైసీపీ నాయకులు ఈ సినిమా టీడీపీ కి అపాదించారు రాజధాని ఫైల్స్ సినిమా ఆపాలని వైసీపీ నాయకులు కోర్టు కు వెళ్లారు.
అమరావతి రాజధాని ప్రాంత రైతులను జగన్ మోసం చేశారు
మూడు రాజధానులు విషయంలో కోర్టు జగన్ కు చివాట్లు పెట్టింది అని అన్నారు
జగన్ అన్ని విషయాలలో మాట తప్పారు మడమ తిప్పారు.రానున్న ఎన్నికలలో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం అన్నారు రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు

కె గోపాల్ రెడ్డి
మీడియా కోఆర్డినేటర్
జిల్లా తెలుగుదేశం పార్టీ

Use Social Media to Spread the Word about Our News

related articles