వాలంటైన్స్ డే సందర్భంగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ ప్రసంగించారు

by vvwnews.com

ప్రేమికులకు పెళ్ళిళ్ళు చేస్తాను

మోడీ తోత్తులతో యుద్ధం

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్

రైల్వే న్యూ కాలనీ, (విశాఖ ఉత్తర):

ప్రేమికులకు పెళ్ళిళ్ళు చేస్తాను అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు
డాక్టర్ కే ఏ పాల్ చెప్పారు. ఆయన రైల్వే న్యూ కాలనీ లో గల పార్టీ కార్యాలయంలో బుధ వారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర
మంత్రి బొత్స కు తెలుగులో మాట్లాడం రాదు, లక్ష కోట్లు దోచుకోవడం వచ్చు అని ఎద్దేవా చేశారు.
ప్రేమికులు తల్లిదండ్రులను ఓ ప్పించి వివాహాలు చేసుకోవాలి, లేదంటే తాను పెళ్ళిళ్ళు చేస్తాను అని భరోసా ఇచ్చారు.
విశాఖ ఎం.పి.అభ్యర్థిగా తాను పోటీ చేస్తాను అని తెలియగానే విశాఖ ఎం.పి. ఎం.వి.వీ. సత్యనారాయణ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కన్నా కే ఏ పాల్ వెయ్యి రెట్లు బెటర్ అన్నారు అని ఆయన గుర్తు చేశారు. తన మీద టీడీపీ నేత భరత్ పోటీ చేయను అన్నారు. జగన్ తల్లి, చెల్లిని మోసం చేశారు. షర్మిల 1 6 నెలల పాద యాత్ర తోనే జగన్ అధికారం పొందారు.
పి వి సి అధ్యక్ష పదవి తీసుకున్న షర్మిల టీడీపీ విజయానికి దోహదం చేస్తున్నారు అన్నారు. వివేకానంద హత్య కేసులో జగన్ పేరు వుండడం పట్ల తాను అభ్యంతరం వ్యక్తం చేశాను అని గుర్తు చేశారు. తాను ప్రతి నెల 50 వేల మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నాను అని గుర్తు చేశారు. విశాఖలో భూములు, కొండలు దోచుకున్నారు. సీఎం జగన్, విజయ సాయి రెడ్డి, చంద్ర బాబు నాయుడు వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు అని ఆరోపించారు. ఎన్ టి ఆర్ కు భారత రత్న ఇవ్వకపోవడం అన్యాయం. వచ్చే ఎన్నికల్లో స్థానికులను మాత్రమే గెలిపించాలని కోరారు మోడీ తొత్తులతో యుద్ధం – మన విశాఖ సిద్దం అంగన్వాడీ ఉద్యోగాలను పర్మినెంట్ వాలంటీర్లకు రూ.20 వేల జీతం ఇస్తాను, ఏ పి లో
పాలన్న రావాలి పాలన మారాలి అనే నినాదంతో ముందుకు వెళతామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాను.
నాలుగు వేల కోట్ల నిధులు తెస్తాను.
వైసీపీ, బీజేపీ, జన సేన పార్టీలతో విసిగి పోయిన వారు ప్రజాశాంతి పార్టీ తో టచ్ లో వున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles