విశాఖలో గోద్రెజ్ ఇంటీరియో అతిపెద్ద ఫర్నిచర్ స్టోర్ ప్రారంభం
2027 నాటికి రాష్ట్రంలో మరో 20 స్టోర్ల ఏర్పాటు లక్ష్యం
విశాఖపట్నం, జూన్ 18: ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అయిన గోద్రెజ్ ఇంటీరియో విశాఖపట్నంలో తన సరికొత్త కంపెనీ సొంత స్టోర్ (COCO)ను ప్రారంభించింది. గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ ద్వారకానగర్‌లో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద గోద్రెజ్ ఇంటీరియో షోరూమ్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా గోద్రెజ్ ఇంటీరియో కన్స్యూమర్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ డాక్టర్ దేవ్ నారాయణ్ సర్కార్ మాట్లాడుతూ, కస్టమర్లకు నాణ్యమైన ఫర్నిచర్‌ను మరింత చేరువ చేయడంతో పాటు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కొత్త స్టోర్‌లో వివిధ రకాల డిజైన్లు, స్టైల్స్, ఫీచర్లతో కూడిన ఫర్నిచర్‌ను ప్రత్యక్షంగా పరిశీలించి ఎంపిక చేసుకునే అవకాశం కస్టమర్లకు కల్పించినట్లు పేర్కొన్నారు.
వైజాగ్‌లో గోద్రెజ్ ఇంటీరియో బ్రాండ్‌కు ఉన్న ఆదరణ, స్టోర్ ఉన్న ప్రధాన ప్రాంతం దృష్ట్యా 2027 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ఒక్క స్టోర్ నుంచే రూ.10 కోట్ల వార్షిక ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే గణనీయమైన కస్టమర్ బేస్ ఉన్నందున 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో 20 స్టోర్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో 25 శాతం వృద్ధిని నమోదు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రూ.40 కోట్ల, దక్షిణాది రాష్ట్రాల్లో రూ.300 కోట్ల ఆదాయాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
ద్వారకానగర్‌లోని ఈ కొత్త స్టోర్‌లో లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, డైనింగ్ రూమ్, హోమ్ స్టోరేజ్, మ్యాట్రెస్‌లు, హోమ్ ఫర్నిషింగ్స్‌తో పాటు ఆఫీస్ ఫర్నిచర్ విభాగాలకు చెందిన విభిన్న ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన సాఫ్ట్ ఫర్నిషింగ్స్, అప్‌మాడ్స్ సిరీస్, క్రియేషన్స్ ఎక్స్3, స్టీల్ కిచెన్ 2.0, ఎకానమీ రేంజ్ ఉత్పత్తులు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది.
అలాగే కొత్త స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపిక చేసిన ఉత్పత్తులపై 35 శాతం వరకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ‘సమ్మర్ చిల్ ఆఫర్’లో భాగంగా కస్టమర్లకు ఉచిత ఎయిర్ కండీషనర్ గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.
కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఫర్నిచర్‌ను రూపొందించుకునేందుకు 3డీ ప్లానర్లు, కాన్ఫిగరేటర్లు, మార్కెటింగ్ క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలను కూడా ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంచినట్లు సంస్థ వెల్లడించింది. దీంతో వినియోగదారులు తమ అభిరుచులకు అనుగుణంగా ఫర్నిచర్‌ను సులభంగా ఎంపిక చేసుకుని కస్టమైజ్ చేసుకునే అవకాశం పొందనున్నారు.