జూన్ 15 నుండి ‘SIR’ అవగాహన కార్యక్రమం.. జాగ్రత్తగా మ్యాపింగ్ చేసుకోవాలన్న వైఎస్సార్సీపీ నేతలు

by vvwnews.com

*జూన్ 15 నుండి ‘SIR’ అవగాహన కార్యక్రమం.. జాగ్రత్తగా మ్యాపింగ్ చేసుకోవాలన్న వైఎస్సార్సీపీ మైనారిటీ నేతలు*

విశాఖ అక్కయ్యపాలెం తాజ్ బాగ్ దర్గా వద్ద వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా మైనారిటీ అధ్యక్షులు బర్కత్ అలీ ఆధ్వర్యంలో SIR అవగాహన కార్యక్రమం పై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ.. జూన్15 నుండి SIR కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం 2002 వ సంవత్సరంలో జరిగిందని, మళ్లీ 2026 లో మరలా జరుగుతుందని తెలిపారు. మీ ఇంటికి వచ్చిన బిఎల్ఓ లతో మ్యాపింగ్ ను చాలా జాగ్రత్తగా చేసుకోవాలని తెలిపారు. ఈ విషయంపై ఎలాంటి సందేహాలున్న వైఎస్ఆర్సిపి మైనారిటీ నాయకులు క్యాంపైన్ లు నిర్వహించి ఎల్లప్పుడు అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫరుకి, బాబా, జహీర్ అహ్మద్, షరీఫ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles