4
ప్రభాకర్…
విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సువార్త రాజు (బుజ్జి) జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం, పండ్లు, స్వీట్లు, మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు కృపామయ ప్రార్థన సహవాసంలో ప్రత్యేక ఆశీర్వాద ప్రార్థనలు నిర్వహించారు.
పార్టీ నాయకులు మల్లా విజయ్ బుజ్జి, తర్లాడ గోవిందు, కఠారి కృష్ణ, రంగాల రవికుమార్, లాండా సుధాకర్, దళాయి నూకరాజుల ఆధ్వర్యంలో పలు కూడళ్లలో సువార్త రాజును శాలువాలతో ఘనంగా సత్కరించి కేక్ కటింగ్ చేశారు. చిన దుర్గాలమ్మ గుడి సెంటర్, సరస్వతి పార్క్ వద్ద మహేష్ బాబు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. స్థానికులు, కార్యకర్తల కోలాహలం, బాణాసంచా సంబరాల మధ్య ఈ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి.