ఎర్నిమాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అచ్చయ్యమ్మపేట నుండి భక్తులు అమ్మవారి

by vvwnews.com

11.ఎల్లమ్మ తోట

ఎర్నిమాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అచ్చయ్యమ్మపేట నుండి భక్తులు అమ్మవారి ప్రథమలను పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఎర్ని మాంబ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆదినారాయణ, పోలమాంబ ఆలయ కమిటీ అధ్యక్షుడు వాసుపల్లి సూర్యారావు మీడియాతో మాట్లాడారు. 1948 నుండి ఎర్నిమాంబ అమ్మవారి ఆలయాన్ని నిర్మించి తమ పూర్వీకులు పూజలు గావించారని చెప్పారు. 2007వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించినట్లు తెలిపారు. తమ ఇలవేల్పు ఎర్నిమాంబ అమ్మవారు ఎంతో మహిమగల దేవత అని చెప్పారు. భక్తుల పాలిట కొంగు బంగారమై ఎర్నిమాంబ అమ్మవారు విరాజిల్లుతోందని తెలియజేశారు. అమ్మవారి జాతర సందర్భంగా తమ గ్రామము నుండి భక్తులు అమ్మవారి ప్రతిమలను భక్తిశ్రద్ధలతో నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారని పేర్కొన్నారు.
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆదినారాయణ, సూర్యారావులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సెక్రటరీ కోదండరావు, వైస్ ప్రెసిడెంట్ వాసుపల్లి నారాయణ, కోసాధికారి రాంకుమార్, జాయింట్ కోశాధికారి సోమినాయుడు,ఆడిటర్ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles